రేవంత్‌కు అధ్యక్ష పదవి కష్టమే.. తొక్కేస్తున్నారే..!?

రేవంత్ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. పరిచయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఈయన.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే.. ఆయనే ఫ్యూచర్ సీఎం.. ఆయనకే పీసీసీ పదవి అంటూ గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. అంతేకాదు.. ఈ విషయాన్ని రేవంత్ అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే.. ఎవరేమనుకున్నా.. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రేంజే వేరు.

ఎవరెలా ఉంటారో..!?

సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఘోరంగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి గెలిచి పరువు నిలుపుకున్నారు. దీంతో ఆయనకు పూర్వవైభవం వచ్చినట్లయ్యింది. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల వరకే హడావుడి చేసే ఈయన.. ఢిల్లీకి చేరుకున్నారు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ధీనస్థితిలో ఉంది. ఎవరు పార్టీలో కొనసాగుతున్నారో..? ఎవరెప్పుడు కారెక్కుస్తున్నారో (టీఆర్ఎస్).. ఎంతమంది నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనంతటికీ కారణం సరైన నాయకత్వం లేకపోవడం.. అధిష్టానం చెప్పిన మాటను ఎవరూ లెక్కచేయకపోవడమే. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థలు, డీసీసీబీ ఇలా వరుసగా ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ పార్టీ నాయకత్వంలో మాత్రం అస్సలు చలనం లేదు.. అధిష్టానం అంటే అస్సలే లెక్కలేదు.

రేవంతేనా కింగ్..!?

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఒక్కో రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోతుండటంతో పీసీసీలు మొదలుకుని డీపీసీసీ వరకూ అందర్నీ మార్చేయాలని అధిష్టానం భావిస్తోంది. దీనికి కారణం ఇప్పటికే కర్నాటకలో ప్రభుత్వాన్ని కోల్పోవడం.. మధ్యప్రదేశ్‌లో కూడా ప్రభుత్వం కోల్పోయే పరిస్థితి రావడం. ఇందులో భాగంగానే త్వరలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడ్ని అధిష్టానం ప్రకటించబోతోంది. అయితే ఈ రేసులో మాత్రం రేవంత్ రెడ్డి మొదటి వరుసలో ఉండగా కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం రేవంత్ రెడ్డికే అవకాశాలున్నాయ్. రేవంత్‌కు ఇస్తే మాత్రం తిరుగుబాటు గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే.. రేవంత్ నిన్నగాక మొన్న కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తి.. అంతేకాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలో ఆయన్ను తొక్కేస్తున్నారు కూడా. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ విషయానికొస్తే.. వీళ్లు ఆది నుంచే పార్టీకి సేవలందిస్తూ కీలక నేతలు ఓ వెలుగు వెలుగుతున్నారు. అంతేకాదు.. శ్రీధర్ బాబు కూడా సీనియర్ ఎమ్మెల్యే.. అంతేకాదు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కే దాదాపు ఈ పదవి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయ్.

తీస్‌మారేం కాదు..

రేవంత్ రెడ్డి తీస్‌మారేం కాదు అని సొంత పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 111 జీవో విషయంలో రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారని కన్నెర్రజేశారు. మరీముఖ్యంగా.. ‘శ్రీధర్ బాబు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ రేవంత్ రెడ్డి అనుచరులు ఫేస్ బుక్‌లో దుష్ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారు. దీన్ని సహించేది లేదు. రేవంత్ కాబోయే సీఎం అని.. పీసీసీ అధ్యక్షుడు అంటూ ఊదరగొడుతున్నారు. రేవంత్ రెడ్డి అంత తీస్‌మార్ ఖాన్ కాదు. అంత తీస్ మార్ ఖాన్ అయితే.. టీడీపీలో ఉండే ఎందుకు చేసుకోలేడు?. నువ్వు మగాడివే కదా.. టీడీపీలో ఉండి మగాడివి అని ఎందుకు అనిపించుకోలేదు? నిన్ను అడిగేవారు లేక ఇదంతా చేస్తున్నారా? ఎలా కనపడుతున్నాం’ అని రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

నిర్ణయమేంటో..!?

మొత్తానికి చూస్తే.. అదేదో సామెత ఉంది కదా.. అలాగా సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే ఈ రేంజ్‌లో వ్యతిరేకత, విమర్శలు ఉంటే.. ఇక ఆయనకు పీసీసీ పదవి కాదు కదా.. పార్టీలో కూడా ఉండటం కష్టమేనేమో. మరోవైపు వరుస కేసులు, కోర్టులు అంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ సతమతం చేస్తోంది.. ఇలాంటి తరుణంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఏంటో వేచి చూడాల్సిందే మరి.

More News

నెల్లూరు వాసికి కరోనా.. థియేటర్స్ బంద్

ఏపీలో తొలి కరోనా కేసు నెల్లూరు జిల్లాలో నమోదైన సంగతి తెలిసిందే. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో

'అన్నపూర్ణమ్మ గారి మనవడు'తో మ‌ళ్ళీ అవ‌కాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నా - బాలాదిత్య

నా పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. అన్నారు బాలాదిత్య. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం

జేసీ బ్రదర్స్ ఇలాంటి పరిస్థితికి దిగజారిపోయారేం!?

సర్పంచ్‌గా పోటీ చేసిన వ్యక్తి రేపొద్దున ఏ ఎంపీటీసీనో.. జడ్పీటీసీనో.. లేకుంటే అంతకుమించి ఏదైనా కోరుకుంటారు.

కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి.. కవిత పరిస్థితేంటి..!?

కల్వకుంట్ల కవిత విషయంలో కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో ఘోరంగా ఓడిపోయిన కవితకు పార్టీలో ఆయనిచ్చే ప్రాధాన్యమేంటి..?

రాజీనామాలు చేయకుండా ఈ ట్విస్ట్‌లేంటి.. తమ్ముళ్లూ!?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.