రవితేజ కథ మెగా హీరోకి సెట్ అవుతుందా ?

  • IndiaGlitz, [Monday,June 07 2021]

నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, సినిమా చూపిస్త మావ లాంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకులు త్రినాథ్ రావు నక్కిన. చాలా కాలం నుంచి రవితేజతో సినిమా చేసేందుకు ఆయన ఎదురుచూస్తున్నారు. పూర్తి కథ కూడా రెడీ చేసుకున్నారు.

ఇదీ చదవండి: శర్వానంద్ సినిమాపై నితిన్ డౌట్.. అందుకే పక్కన పెట్టేశాడా ?

రవితేజకు, త్రినాథ రావుకు మధ్య గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చలు కూడా జరిగాయి. ఏమైందో ఏమో కానీ తాజాగా రవితేజ ఈ చిత్రాన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీనితో త్రినాథ రావు కొత్త హీరోని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రం మెగా హీరో చేతుల్లోకి వెళ్ళబోతున్నట్లు టాక్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఈ చిత్రం తెరకెక్కించాలని త్రినాథ రావు ఆసక్తి చూపుతున్నారట. రవితేజ కోసం సిద్ధం చేసిన కథ వరుణ్ తేజ్ కు సెట్ అవుతుందా అనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. అంటే కథలో మార్పులు తప్పనిసరి కావచ్చు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో 'గని' అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే 'ఎఫ్3' కూడా సెట్స్ పై ఉంది. త్రినాధరావు దర్శకత్వంలో చిత్రానికి కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.