ఈ సారి రవితేజకి వర్కవుట్ అవుద్దా?
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ సినీ కెరీర్‌లో సక్సెస్ రేట్ ఎక్కువే. అయితే.. మే నెలలో విడుదలైన సినిమాల విషయాలకి వస్తే మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సోలో హీరోగా నటించిన సినిమాల పరంగా రవితేజ సినీ కెరీర్‌ను ఒక్కసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకు మే నెలలో నాలుగు సినిమాలు (‘భద్ర’, ‘కిక్’, ‘వీర’, ‘దరువు’) విడుదల కాగా.. అందులో ‘భద్ర’, ‘కిక్’ విజయాలు సాధించగా.. ‘వీర’, ‘దరువు’ సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి.
అయితే.. ‘భద్ర’, ‘కిక్’ చిత్రాలు మే నెలలో ఫస్ట్ హాఫ్‌లో అంటే.. మే 12, 2005న ‘భద్ర’ సినిమా విడుదల కాగా.. మే 8, 2009న ‘కిక్’ విడుదలైంది. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక మే సెకండ్ హాఫ్‌లో విడుదలైన ‘వీర’ (మే 20, 2011) సినిమా గాని.. అలాగే ‘దరువు’ చిత్రం గాని (మే 25, 2012) రవితేజకి ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత ‘దరువు’ విడుదలైన తేదీకే ( మే 25) విడుదలవుతున్న తన తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’తోనైనా రవితేజ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments