ఇంత‌కీ ర‌వితేజ‌... విక్ర‌మా?  వేదానా?

  • IndiaGlitz, [Tuesday,August 27 2019]

ఇంత‌కీ ర‌వితేజ ఏ పాత్ర‌ను చూజ్ చేసుకోబోతున్నారు? విక్ర‌మ్‌గా క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారా... వేదాగా చేయ‌డానికి మొగ్గుచూపుతారా? ఆ విష‌యాన్ని సుధీర్ వ‌ర్మ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్ ప‌రంగా వ‌ర్క్ చేస్తున్న‌ది సుధీర్ వ‌ర్మ‌కాబ‌ట్టి. 'విక్ర‌మ్ వేద‌' చిత్రం త‌మిళంలో మాధ‌వ‌న్‌, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం. తెలుగులో సుధీర్ వ‌ర్మ ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేస్తున్నారు.

విక్ర‌మ్ వేద స్క్రిప్ట్ ను తెలుగు సెన్సిబిలిటీస్‌కి అనుగుణంగా ఆయ‌న తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే మార్పులూ చేర్పులూ జ‌రుగుతున్నాయి. విక్ర‌మ్ పాత్ర పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌. పోలీస్ పాత్ర‌ల్లో ఫిట్‌గా ఉండ‌టం ర‌వితేజ‌కు కొత్త కాదు. మ‌రో పాత్ర విల‌న్ పాత్ర‌. ఆ పాత్ర మాత్రం కొత్త‌గానే ఉంటుంది. అయినా విక్ర‌మ్ పాత్ర మీదే ర‌వితేజ మ‌న‌సు ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. అదే నిజ‌మైతే మ‌రి వేద పాత్ర ఎవరు చేస్తార‌నేది కూడా ఆస‌క్తిక‌ర‌మే. ఆర్‌.ఎక్స్.100 కార్తికేయ చేయొచ్చ‌నే ఖ‌బ‌ర్ చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇంత‌కీ క‌థేంటి?

విక్ర‌మ్ పోలీస్ ఆఫీస‌ర్‌. వేద గ్యాంగ్‌స్ట‌ర్‌. అత‌న్ని చేజ్ చేస్తాడు విక్ర‌మ్‌. ఒకానొక సంద‌ర్భంలో విక్ర‌మ్ కీ, వేదాకి మ‌ధ్య ప్రొఫెష‌న‌ల్ విష‌యం ప‌క్క‌కు జ‌రిగి, ప‌ర్స‌న‌ల్ రైవ‌ల్రీ మొద‌ల‌వుతుంది. ఆ క్యాట్ అండ్ మౌస్ ఫైట్ ఎందుకు? ఏం జ‌రిగింది? అనేది ఆస‌క్తిక‌రం. త‌మిళంలో ఈ సినిమా శ్ర‌ద్ధ శ్రీనాథ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. మ‌రి తెలుగులో ఆమెను తీసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

త‌మిళంలో ఈ చిత్రాన్ని నిర్మించిన వైనాట్ స్టూడియోస్ తెలుగులోనూ ఈ సినిమాను నిర్మించ‌నుంది. ర‌వితేజ ప్ర‌స్తుతం 'డిస్కోరాజా' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సైఫైగా తెర‌కెక్కే ఆ చిత్రంలో ఆయ‌న ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. రామ్ తాళ్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సుధీర్ వ‌ర్మ ఇటీవ‌ల తెర‌కెక్కించిన 'ర‌ణ‌రంగం' అనుకున్నంత‌గా ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను దోచుకోలేక‌పోయింది.

More News

పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అజిత్‌

అజిత్ 60వ సినిమా కోసం రంగం సిద్ధ‌మ‌వుతోంది. బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'వాల్మీకి' ..వాయిదా త‌ప్పేలా లేదా?

`సాహో` ఎఫెక్ట్ చాలా సినిమాల‌పై ఇన్ డైరెక్ట‌ర్‌గా ఎఫెక్ట్ చూపించింది. `ఎవ‌రు`, `ర‌ణ‌రంగం` వంటి సినిమాలు ప్రీ పోన్ అయితే..

సెప్టెంబర్ 20న హైదరాబాద్ లో దాదాసాహెబ్ ఫాల్కే సౌత్  అవార్డ్స్ - 2019 ఇన్విటేషన్, లోగో లాంచ్

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019కి తెరలేచింది. దాదాసాహెబ్ 150వ బర్త్ యానివర్శరీని పురస్కరించుకొని ఈ అవార్డ్స్ వేడుకను

నాని - శివ నిర్వాణ - షైన్ స్క్రీన్!

ఇటీవ‌లే `మ‌జిలీ`తో విజ‌యాన్ని చ‌విచూసిన శివ నిర్వాణ‌కు అస‌లు తొలి బ్రేక్ ఇచ్చింది నాని. `నిన్ను కోరి`వంటి కాంప్లెక్స్ స్క్రిప్ట్ ను అంగీక‌రించి, శివ నిర్వాణ‌కు ఓ లైఫ్ ఇచ్చాడు నాని.

‘సాహో’ టికెట్ ధర పెరగనుందా?

స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే సామాన్యంగా టికెట్ ధరలకు రెక్కలొస్తాయి. ఫ్యాన్స్ షో సమయంలో ఈ టికెట్ ధరలు రెండు, మూడువేలరూపాయలవుతాయి.