రజనీకాంత్ తో రమ్యకృష్ణ రెడీ అవుతుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
17 ఏళ్ల తర్వాత రజనీకాంత్, రమ్యకృష్ణలు కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. 1999లో విడుదలైన నరసింహ(తమిళంలో పడయప్పా) చిత్రంలో నరసింహగా రజనీకాంత్, నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఈ జోడి మళ్ళీ నటించలేదు. అయితే ఇప్పుడు అంటే 17 సంవత్సరాలు తర్వాత తెరపై కనిపించబోతున్నారట. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 2.0 ది సీక్వెల్ ఆఫ్ రోబోలో ఓ కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించనుందట. అయితే ఆ పాత్ర ఎలాంటిదనే సంగతి మాత్రం తెలియకుండా శంకర్ అండ్ టీం జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం రజనీకాంత్ యు.ఎస్‌లో ఉన్నారు. అక్కడి నుండి రాగానే, అంటే ఆగస్టులో రజనీకాంత్, రమ్యకృష్ణ పార్ట్ కు సంబందించిన చిత్రీకరణ జరుగుతుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments