రామానాయుడుస్టూడియో క‌నుమ‌రుగ‌వనుందా?

  • IndiaGlitz, [Monday,February 17 2020]

మూవీ మొఘ‌ల్‌.. డా.డి.రామానాయుడు, తెలుగు చిత్ర‌సీమ మ‌ర‌చిపోలేని పేరు. శ‌తాధిక చిత్ర నిర్మాతే కాదు. భార‌త‌దేశంలో అధికారిక భాషల‌న్నింటిలోనూ సినిమాల‌ను నిర్మించిన నిర్మాత‌. ఎన్టీఆర్ నుండి నేటి త‌రం కుర్ర హీరోల వ‌ర‌కు సినిమాల‌ను నిర్మించారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెన్నై నుండి హైద‌ర‌బాద్ వ‌చ్చిన‌ప్పుడు ఇక్కడ త‌న పేరుతోనే స్టూడియో నిర్మించారాయ‌న‌. ఇది కాకుండా ప్రైవేటుగా కొంత స్థలం కొని అక్క‌డ కూడా స్టూడియో నిర్మించారు. అదే నాన‌క్ రామ్ గూడ రామానాయుడు స్టూడియో. ఇక్క చిన్నా, పెద్ద అంటూ వంద‌ల సినిమాలు నిర్మిత‌మ‌వ‌య్యాయి.

కానీ లేటెస్ట్ సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న గుస‌గుస‌లు ప్ర‌కారం ఈ నాన‌క్‌రామ్ గూడ రామానాయుడు స్టూడియో క‌నుమ‌రుగుకానుంద‌ట‌. ఎందుకంటే.. ఈ స్థ‌లాన్ని రామానాయుడు త‌న‌యుడు, నిర్మాత డి.సురేష్‌బాబు డెవ‌ల‌ప్‌మెంట్ కోసంమీనాక్షి క‌న్‌స్ట్ర‌క్ష‌న్ అనే కంపెనీకి రాసి ఇచ్చాడ‌ట‌. త‌ర్వ‌లోనే ప్లాట్లు వేసి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం జ‌రుగుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త‌ల‌పై సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

More News

ఫిబ్రవరి 28న ధనుష్ 'లోకల్ బాయ్'

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. 'రఘువరన్ బీటెక్'లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు: మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

ఇప్పుడున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్రకు ఓ ప్రత్యేకత ఉంది. చాలా మంది ప్లే లిస్ట్స్ లో ఈయన సంగీతం అందించిన పాటలే ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.

హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్,ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్,టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

`జాను` వ‌ల్ల దిల్‌రాజుకి న‌ష్ట‌మెంతో తెలుసా?

ఎంత గొప్ప మేక‌ర్ అయినా కొన్ని సినిమాలను అంచ‌నా వేయ‌డంలో త‌ప్పులు చేస్తుంటారు.

సురేంద‌ర్ రెడ్డి, వ‌రుణ్‌తేజ్ సినిమా అందుకే ఆగిందా?

గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవితో `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి హిస్టారిక‌ల్ సినిమా చేసిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.