రామానాయుడుస్టూడియో కనుమరుగవనుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మూవీ మొఘల్.. డా.డి.రామానాయుడు, తెలుగు చిత్రసీమ మరచిపోలేని పేరు. శతాధిక చిత్ర నిర్మాతే కాదు. భారతదేశంలో అధికారిక భాషలన్నింటిలోనూ సినిమాలను నిర్మించిన నిర్మాత. ఎన్టీఆర్ నుండి నేటి తరం కుర్ర హీరోల వరకు సినిమాలను నిర్మించారు. చిత్ర పరిశ్రమలో చెన్నై నుండి హైదరబాద్ వచ్చినప్పుడు ఇక్కడ తన పేరుతోనే స్టూడియో నిర్మించారాయన. ఇది కాకుండా ప్రైవేటుగా కొంత స్థలం కొని అక్కడ కూడా స్టూడియో నిర్మించారు. అదే నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియో. ఇక్క చిన్నా, పెద్ద అంటూ వందల సినిమాలు నిర్మితమవయ్యాయి.
కానీ లేటెస్ట్ సినీ వర్గాల్లో వినపడుతున్న గుసగుసలు ప్రకారం ఈ నానక్‌రామ్ గూడ రామానాయుడు స్టూడియో కనుమరుగుకానుందట. ఎందుకంటే.. ఈ స్థలాన్ని రామానాయుడు తనయుడు, నిర్మాత డి.సురేష్‌బాబు డెవలప్మెంట్ కోసంమీనాక్షి కన్స్ట్రక్షన్ అనే కంపెనీకి రాసి ఇచ్చాడట. తర్వలోనే ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందని వార్తలు వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలపై సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout