రామ్ కి మరోసారి కలిసొస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
కందిరీగ తరువాత సరైన విజయం లేని యువ కథానాయకుడు రామ్‌కి ఊరటనిచ్చిన చిత్రం నేను శైలజ. గతేడాది జనవరి 1న వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ చిత్రం తరువాత హైపర్ చేస్తే.. ఆశించిన ఫలితం రాలేదు. దీంతో మళ్లీ అదే నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో మరో సినిమా చేస్తున్నాడు రామ్. ఉన్నది ఒక్కటే జిందగీ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉందని సినిమాలో రామ్ లుక్‌ను చూసిన వాళ్లందరూ అంటున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అంతేకాకుండా.. ఆ చిత్రంలో కేరళ కుట్టి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తే.. తాజా చిత్రంలో మరో మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఓ హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ కేరళ కుట్టిల సెంటిమెంట్ కూడా రామ్‌కి మరోసారి కలిసొస్తుందా? వెయిట్ అండ్ సీ!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com