ప్రభాస్ ఫారిన్ వెళ్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనాకు పెద్దా చిన్నా తేడా లేకుండా అందరూ వణుకుతుంటే, ప్రభాస్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అవుననే అంటున్నాయి ఆయనకు సన్నిహిత వర్గాలు. అయితే ఫ్యాన్స్ బెంబేలుపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన ప్లాన్ చేస్తున్నది ఇప్పట్లో కాదన్నమాట. విషయంలోకి వెళ్తే... ప్రభాస్, పూజా జోడీగా రాధాకృష్ణకుమార్ డైరక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో కొన్ని సెట్లు వేశారు. సినిమా షూటింగ్ కూడా ఈ నెల్లోనే మొదలుపెడదామని అనుకున్నారు. అయితే అనూహ్యంగా తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. పైగా ఈ షూటింగ్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వ్యక్తులు రావాల్సి ఉంది. అందుకే రిస్క్ ఎందుకని ఇంకో నెల్లాళ్ల పాటు షూటింగ్‌ని పోస్ట్ పోన్ చేసుకున్నారు.
ఆ గ్యాప్‌లోనే ఆర్ట్ వర్క్ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఓ ఐసీయు సెట్, జనరల్ వాడ్, డాక్టర్ల రూమ్‌లు...ఇలా పక్కా హాస్పిటల్ ని రీ కన్‌స్ట్రక్ట్ చేయబోతున్నారట. అయితే దానికి అయ్యే ఖర్చు రూజ5కోట్లన్నదే అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఓ ప్రైవేట్ స్టూడియోలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఈ నెలాఖరు నుంచి మొదలుపెడతారని టాక్.
మరోవైపు ఆస్ట్రియాలో తెరకెక్కించాలనుకున్న అన్నీ షాట్స్ నూ జార్జియాలో పూర్తి చేయాలని భావిస్తోందట యూనిట్. ఆస్ట్రియాతో పోలిస్తే జార్జియాలో కరోనా కేసులు తక్కువగా ఉండటంతో ఆ దశగా ఆలోచిస్తోందట. ఏదేమైనా ఆ షెడ్యూల్ ఇప్పట్లో ఉండదు. ముందు ఈ సెట్లో చేయాల్సిన సన్నివేశాలన్నీ పూర్తయ్యాకే ఉంటుంది. దీన్ని బట్టి ఇక్కడ ఆగస్టులో షూటింగ్ పూర్తయినా..ఏ సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లోనో జార్జియా షెడ్యూల్ ఉండొచ్చన్నది ఒక అంచనా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments