ప్ర‌భాస్ ఫారిన్ వెళ్తాడా?

  • IndiaGlitz, [Monday,June 22 2020]

క‌రోనాకు పెద్దా చిన్నా తేడా లేకుండా అంద‌రూ వ‌ణుకుతుంటే, ప్ర‌భాస్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అవున‌నే అంటున్నాయి ఆయ‌న‌కు స‌న్నిహిత వ‌ర్గాలు. అయితే ఫ్యాన్స్ బెంబేలుప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఆయ‌న ప్లాన్ చేస్తున్న‌ది ఇప్ప‌ట్లో కాద‌న్న‌మాట‌. విష‌యంలోకి వెళ్తే... ప్ర‌భాస్, పూజా జోడీగా రాధాకృష్ణ‌కుమార్ డైర‌క్ష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో కొన్ని సెట్లు వేశారు. సినిమా షూటింగ్ కూడా ఈ నెల్లోనే మొద‌లుపెడ‌దామ‌ని అనుకున్నారు. అయితే అనూహ్యంగా తెలంగాణ‌లో కేసులు పెరుగుతున్నాయి. పైగా ఈ షూటింగ్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వ్య‌క్తులు రావాల్సి ఉంది. అందుకే రిస్క్ ఎందుక‌ని ఇంకో నెల్లాళ్ల పాటు షూటింగ్‌ని పోస్ట్ పోన్ చేసుకున్నారు.

ఆ గ్యాప్‌లోనే ఆర్ట్ వ‌ర్క్ మొద‌లుపెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. ఓ ఐసీయు సెట్‌, జ‌న‌ర‌ల్ వాడ్‌, డాక్ట‌ర్ల రూమ్‌లు...ఇలా ప‌క్కా హాస్పిట‌ల్ ని రీ క‌న్‌స్ట్ర‌క్ట్ చేయ‌బోతున్నార‌ట‌. అయితే దానికి అయ్యే ఖ‌ర్చు రూజ‌5కోట్ల‌న్న‌దే అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. ఓ ప్రైవేట్ స్టూడియోలో దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను ఈ నెలాఖ‌రు నుంచి మొద‌లుపెడ‌తార‌ని టాక్‌.

మ‌రోవైపు ఆస్ట్రియాలో తెర‌కెక్కించాల‌నుకున్న అన్నీ షాట్స్ నూ జార్జియాలో పూర్తి చేయాల‌ని భావిస్తోంద‌ట యూనిట్‌. ఆస్ట్రియాతో పోలిస్తే జార్జియాలో క‌రోనా కేసులు త‌క్కువ‌గా ఉండ‌టంతో ఆ ద‌శ‌గా ఆలోచిస్తోంద‌ట‌. ఏదేమైనా ఆ షెడ్యూల్ ఇప్ప‌ట్లో ఉండ‌దు. ముందు ఈ సెట్లో చేయాల్సిన స‌న్నివేశాల‌న్నీ పూర్త‌య్యాకే ఉంటుంది. దీన్ని బ‌ట్టి ఇక్క‌డ ఆగ‌స్టులో షూటింగ్ పూర్త‌యినా..ఏ సెప్టెంబ‌ర్‌లోనో, అక్టోబ‌ర్‌లోనో జార్జియా షెడ్యూల్ ఉండొచ్చ‌న్న‌ది ఒక అంచ‌నా.

More News

విశాల్ 'చ‌క్ర' ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్ ఆఫ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

యాక్ష‌న్‌ హీరో విశాల్ హీరోగా ఎం.ఎస్ ఆనంద‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ మూవీ `చ‌క్ర‌`. విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆర్జీవీ ‘మర్డర్’ సినిమాపై అమృత స్పందించలేదు: బాలస్వామి

ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా వర్మ తను తీయబోయే కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

సామూహిక వ్యాప్తి దిశగా తెలంగాణ.. ప్రస్తుతానికి ఏపీ సేఫ్

కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దిశగా కొనసాగుతోందా? అంటే ఇండియా ఇన్ పిక్సల్స్ అవుననే అంటోంది.

మీ సిల్లీ జోకులను చూడటానికి బతికే ఉన్నాం: నయన్ విఘ్నేష్

ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయడంలో సోషల్ మీడియా ముందుంటుంది. కరోనా స్ప్రెడ్డింగ్ ఏ రేంజ్‌లో ఉందో..

ఇండస్ట్రీలో ఎవరైనా నచ్చకుంటే వారి మానాన వారిని వదిలెయ్యండి: డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇండస్ట్రీలో కొందరి ప్రవర్తనను ప్రశ్నించింది. ఇండస్ట్రీలో అందలమెక్కించే భుజాలే కాదు..