ఆ విషయంలో ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇంకా ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా ప్రారంభం కానే లేదు. కానీ అప్పుడే రికార్డుల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టేశారు. ఇంతకూ ఆదిపురుష్ ఏ విషయంలో రికార్డ్ క్రియేట్ చేయనుందనే వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడుగా నటిస్తోన్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'(రామాయణం). త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీల్లో రూపొందించి దాన్ని మిగిలిన భాషల్లో అనువాదం చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'రాధేశ్యామ్' సినిమా పూర్తి చేయగానే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీగా నాగ్ అశ్విన్ మూవీని స్టార్ట్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలా చేయడం లేదట. ఆ సినిమా కంటే ముందుగానే 'ఆదిపురుష్' సినిమాను ప్రభాస్ షురూ చేస్తాడట. ఈ సినిమా షూటింగ్‌ను ఎక్కువగా గ్రీన్ మ్యాట్, స్టూడియోలోనే చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారట ఓంరౌత్.
ఇప్పటివరకు రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి చిత్రంలో నలబై ఐదు వేల వి.ఎఫ్.ఎక్స్ షాట్స్‌ను ఉపయోగించారట. ఇప్పుడు ఓంరౌత్ రియల్ లొకేషన్స్ కంటే గ్రీన్ మ్యాట్‌లోనే ఎక్కవ షూటింగ్ చేయడం వల్ల వి.ఎఫ్.ఎక్స్‌పైనే ఆధారపడాల్సి వస్తుందట. దీని కారణంగా బాహుబలిని మించే వి.ఎఫ్.ఎక్స్ షాట్స్‌ను ఆదిపురుష్‌లో ఉపయోగిస్తారట. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రభాస్ విలువిద్యను ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇందులో రావణుడుగా సైఫ్ అలీఖాన్ నటింబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments