ప్రభాస్ అందుకు ఒప్పుకుంటాడా..?
Send us your feedback to audioarticles@vaarta.com
2019లో ఎలక్షన్స్ తరుణం కాబట్టి రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దక్షిణాదిన పాగా వేయాలని గట్టి ప్రయత్నాలనే చేస్తూ ఉంది. తమిళనాడు నుండి రజనీకాంత్‌ను ముగ్గులోకి దింపాలని చూస్తుంది. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్‌ను వాడుకోవాలని చూస్తుంది. బాహుబలి-2 సెన్సేషనల్ హిట్‌తో ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు.
ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్‌ను తెలుగు రాష్ట్రాల్లో బిజెపి వాడుకునే ప్రయత్నాలనే చేస్తుందని అంటున్నారు రాజకీయ నిపుణులు. అదీ కాకుండా ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు కేంద్రమంత్రిగా కూడా వర్క్ చేశారు. బిజెపికి కృష్ణంరాజుతో ఉన్న సానిహిత్యంతో ప్రభాస్‌ను ట్రాక్‌లో తేవచ్చునని అంటున్నారు. గత ఎన్నికల్లో బిజెపి అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎదురు తిరిగాడు. పవన్ ఇమేజ్‌ను తట్టుకోవాలంటే వీలైనంత మేర సినిమా ఇమేజ్ హీరోలను బరిలోకి దింపాలనేది బిజెపి ఆలోచనట. అయితే సినిమాల పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రభాస్ బిజెపి తరపున ప్రచారం చేస్తాడా..చూడాలి మరి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments