పవన్‌కీ కలిసొస్తుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ఆరంభించిన కుష్బూ.. దక్షిణాదిన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు చిత్రంతోనే. ఆ సినిమా తరువాత కొన్ని తెలుగు చిత్రాలు చేసినప్పటికీ.. తమిళంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. దర్శకుడు సుందర్.సి ని పెళ్లాడాక సినిమాలను తగ్గించుకున్న కుష్బూ.. తెలుగులో మళ్లీ కనిపించింది మాత్రం చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ చిత్రంతోనే.
ఆ సినిమాలో చిరు అక్కగా నటించిన కుష్బూ.. ఆ తరువాత ఎన్టీఆర్ యమదొంగలో మోహన్‌బాబుకి భార్యగా కనిపించింది. ఈ రెండు చిత్రాలు కూడా మంచి విజయం సాధించినప్పటికీ మళ్లీ తెలుగులో కనిపించలేదామె.
చాన్నాళ్ల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ 25వ చిత్రంలో పవన్ అత్తగా నటిస్తోంది కుష్బూ. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. చిరు, తారక్ కి కలిసొచ్చిన కుష్బూ.. పవన్ కి కూడా కలిసొస్తుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com