పవన్ అంత రిస్క్ చేయడా?

  • IndiaGlitz, [Tuesday,March 07 2017]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టిస్తోన్న 'కాట‌మ‌రాయుడు' షూటింగ్ చివ‌రి స్టేజ్ లో ఉంది. ఫ్యాక్ష‌నిస్టు పాత్ర‌లో ప‌వ‌న్ తొలిసారి క‌నిపించ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. సెంటిమెంట్..యాక్ష‌న్..ఫ‌న్ అంశాల‌తో ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమాగా తెర‌కెక్కుతోన్న చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. త‌మిళ సినిమా 'వీర‌మ్' కు రీమేక్ గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ లో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కు ముందు గుండెల్ని పిండి చేసే ఓ సెంటిమెంట్ స‌న్నివేశం ఉంటుంది.
గాయ‌ప‌డిన హీరోయిన్ భుజాల‌పై ఎత్తుకుని హాస్పిట‌ల్ లో అడ్మిట్ చేస్తాడు హీరో. ఆ స‌మ‌యంలో ఇరువురి మ‌ధ్య పండే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. మాతృక‌లో ఈ సీన్ బాగా పండింది. దీంతో తెలుగులోనూ ఈ సీన్ కంటున్యూ చేయాల‌నుకున్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం అంత రిస్క్ చేయ‌డానికి సిద్దంగా లేడ‌ని స‌మాచారం. ప‌వన్ భుజానికి గ‌తంలో ట్రీట్ మెంట్ జ‌రిగింది. అధిక బ‌రువులు మోయ‌కూడ‌ద‌ని డాక్ట‌ర్లు సూచించ‌డంతో ఆ సీన్ చేయ‌డం లేద‌ని యూనిట్ వ‌ర్గాల స‌మాచారం.

More News

డెబ్యూ హీరో కోసం కన్నడ సూపర్ స్టార్స్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.ఆర్ మనోహర్ అన్నతయుడు ఇషాన్ హీరోగా రూపొందిన చిత్రం `రోగ్`. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరీ త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది.

పూరి సిసలైన పైత్యం 'రోగ్'

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పెన్ను పైత్యం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.

అమ్మ పాత్రలో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ...

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను,యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్ లోద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై

'కమలతో నా ప్రయాణం' '2013-నంది' దక్కించుకోవడం ఆనందాన్నిచ్చింది- నిర్మాత సునీల్ రెడ్డి

ధనార్జనే ధ్యేయంగా కమర్షియల్ సినిమాల కోసం వెంపర్లాడే ఈ సినీప్రపంచంలో కొందరు అందుకు భిన్నంగా వెళుతుంటారు. మంచి కథ, కంటెంట్ని నమ్మి అభిరుచితో మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందించాలని తపనపడుతుంటారు.

151 సెట్స్ కు ముందే ఠారెత్తిపోతుంది!

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా గా `ఉయ్యాల వాడ నరసింహారెడ్డి` బయోగ్రపీ దాదాపు కన్ఫమ్. దర్శకుడిగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగా కాంపౌండ్ మళ్లీ రంగంలోకి దించేస్తుంది.