పవన్ రాజకీయాల్లో ఉంటారా.. సినిమాల్లో ఉంటారా..!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ సినిమాల్లోకి వెళతారా..? లేకుంటే సినిమాలు చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతారా..? అని గత కొన్ని రోజులు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బడా నిర్మాతలు పవన్‌ను సంప్రదించి సినిమా చేయాలని అడిగారని.. కొందరు డైరెక్టర్స్ కథలు కూడా చెప్పారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడిచిన విషయం విదితమే. దీంతో అటు అభిమానులు.. ఇటు జనసేన కార్యకర్తలు కాసింత కన్ఫూజన్‌తో ఆందోళన పడ్డారు. అయితే తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు.
నాగబాబు మాటల్లోనే...
"కళ్యాణ్ బాబు ఎప్పుడూ సినిమా ఆలోచనలు చేయరు. ఇవన్నీ మీడియాలో వస్తున్నవే. పవన్‌ను ఎలాగైనా సరే డిగ్రేడ్ చేయాలనో.. అతడ్ని తగ్గించాలనే చూస్తోంది. పవన్ క్రెడిబిలిటీని తగ్గించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ఇలా చేస్తున్నారు.. అలా చేస్తున్నారని బయట పబ్లిక్ అనట్లేదు.. అభిమానులు అనట్లేదు.. కేవలం మీడియా మాత్రమే ఇలా చేస్తోంది. మీడియా మా తమ్ముడ్ని ఎంత తగ్గించాలని చూసిన పవన్ మాత్రం స్ప్రింగ్‌లా లేస్తారు. ఒకే ఇంట్లో అందరూ ఒకేలాగా ఉండరు. కల్యాణ్ బాబును ఎవరైనా సరే ముట్టుకోకుంటే మంచిది.. ఎవరైనా తొక్కాలని చూస్తే మాత్రం అంతకు వందరెట్లు పైకి లేస్తారు. ప్రతీసారి కల్యాణ్‌ను విమర్శిస్తుంటే అది మాకు ప్లస్సే తప్ప మైనస్ కాదు. నిజంగానే కల్యాణ్ బాబుకు ప్లస్ చేయాలంటే మీరు(మీడియా) విమర్శించొచ్చు. నేను రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతానని.. సినిమాలు చేయనని ఎన్నికల తర్వాత స్వయంగా తమ్ముడే చెప్పాడు. పవన్ ఫుల్‌టైమ్ ప్రజలకోసమే పనిచేస్తారు" అని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. సో.. పవన్ ఇకపై సినిమాలు చేయరని నాగబాబు చెప్పేశారు. ఇకపై అయినా వెబ్‌సైట్లు, మీడియాలో పవన్‌పై వార్తలు తగ్గుతాయో..? లేకుంటే కంటిన్యూ చేస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments