పవన్ రాజకీయాల్లో ఉంటారా.. సినిమాల్లో ఉంటారా..!

  • IndiaGlitz, [Saturday,May 11 2019]

ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ సినిమాల్లోకి వెళతారా..? లేకుంటే సినిమాలు చేస్తూ రాజకీయాల్లో కొనసాగుతారా..? అని గత కొన్ని రోజులు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బడా నిర్మాతలు పవన్‌ను సంప్రదించి సినిమా చేయాలని అడిగారని.. కొందరు డైరెక్టర్స్ కథలు కూడా చెప్పారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడిచిన విషయం విదితమే. దీంతో అటు అభిమానులు.. ఇటు జనసేన కార్యకర్తలు కాసింత కన్ఫూజన్‌తో ఆందోళన పడ్డారు. అయితే తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు.

నాగబాబు మాటల్లోనే...

కళ్యాణ్ బాబు ఎప్పుడూ సినిమా ఆలోచనలు చేయరు. ఇవన్నీ మీడియాలో వస్తున్నవే. పవన్‌ను ఎలాగైనా సరే డిగ్రేడ్ చేయాలనో.. అతడ్ని తగ్గించాలనే చూస్తోంది. పవన్ క్రెడిబిలిటీని తగ్గించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ఇలా చేస్తున్నారు.. అలా చేస్తున్నారని బయట పబ్లిక్ అనట్లేదు.. అభిమానులు అనట్లేదు.. కేవలం మీడియా మాత్రమే ఇలా చేస్తోంది. మీడియా మా తమ్ముడ్ని ఎంత తగ్గించాలని చూసిన పవన్ మాత్రం స్ప్రింగ్‌లా లేస్తారు. ఒకే ఇంట్లో అందరూ ఒకేలాగా ఉండరు. కల్యాణ్ బాబును ఎవరైనా సరే ముట్టుకోకుంటే మంచిది.. ఎవరైనా తొక్కాలని చూస్తే మాత్రం అంతకు వందరెట్లు పైకి లేస్తారు. ప్రతీసారి కల్యాణ్‌ను విమర్శిస్తుంటే అది మాకు ప్లస్సే తప్ప మైనస్ కాదు. నిజంగానే కల్యాణ్ బాబుకు ప్లస్ చేయాలంటే మీరు(మీడియా) విమర్శించొచ్చు. నేను రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతానని.. సినిమాలు చేయనని ఎన్నికల తర్వాత స్వయంగా తమ్ముడే చెప్పాడు. పవన్ ఫుల్‌టైమ్ ప్రజలకోసమే పనిచేస్తారు అని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. సో.. పవన్ ఇకపై సినిమాలు చేయరని నాగబాబు చెప్పేశారు. ఇకపై అయినా వెబ్‌సైట్లు, మీడియాలో పవన్‌పై వార్తలు తగ్గుతాయో..? లేకుంటే కంటిన్యూ చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

More News

లేడీ విల‌న్‌తో బాల‌య్య ఢీ

నంద‌మూరి బాల‌కృష్ణ 105వ సినిమా ఈ నెల 17న లాంఛ‌నంగా ప్రారంభంకానుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

ముహూర్తం కుదిరింది..

హీరో, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విశాల్ త్వ‌రలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

సుప్రీమ్ కోర్టు న్యాయ‌మూర్తిపై పోరాటం చేయ‌నున్న చిన్న‌యి

ద‌క్షిణాదిన మీటూ ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపింది చిన్మ‌యి. సీనియ‌ర్ రైట‌ర్ వైర‌ముత్తు, సీనియ‌ర్ న‌టుడు రాధార‌విపై మీ టూ పోరాటంలో భాగంగా లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది.

టీవీ9 రవిప్రకాష్ ఇకపై షేర్ హోల్డర్ మాత్రమే... 

హైదరాబాద్: టీవీ9 సీఈవోగా రవిప్రకాష్‌ను తొలగించిన అనంతరం అలంద మీడియా సభ్యులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసలు టీవీ9లో ఏం జరిగింది..? రవిప్రకాష్ నిజంగానే సంతకం ఫోర్జరీ చేశారా..?

టీవీ9 సీఈవోగా తొలగింపుపై రవిప్రకాష్ బహిరంగ లేఖ

టీవీ9 ఫౌండర్‌గా, చైర్మన్‌గా, సీఈవోగా సుమారు 15ఏళ్లు పనిచేసిన రవిప్రకాష్‌ను కొత్త యాజమాన్యం తొలగించింది. ఆయన స్థానంలో కన్నడ టీవీ9కి ఎడిటర్, సీఈవోగా పనిచేసిన మహింద్రా మిశ్రాను