ఎన్టీఆర్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన జై లవ కుశ ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. జై పాత్రలో ఎన్టీఆర్ నటనకి సర్వత్రా మంచి స్పందన వచ్చింది. టేకింగ్ పరంగా యావరేజ్ అనిపించుకున్న ఈ సినిమాకి నెగటివ్ టాక్ అయితే రాలేదు. స్పైడర్ రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా వసూళ్లకి సమస్య ఏమీ లేదు. అందునా.. అర్జున్ రెడ్డి తరువాత సరైన సినిమా పడలేదు.
దాదాపు నెల రోజుల తరువాత యావరేజ్ టాక్‌తో ఓ సినిమా వచ్చింది. అందులో దసరా సెలవులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా గట్టెక్కడం ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఎన్టీఆర్ గత చిత్రం జనతా గ్యారేజ్‌కి కూడా ఇలాగే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కట్ చేస్తే.. బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఆ సినిమా విడుదలైన సెప్టెంబర్‌లోనే వచ్చిన జై లవకుశ కూడా అదే మ్యాజిక్‌ని కొనసాగిస్తుందని సినీపండితులు చెప్పుకొస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments