తారక్, చరణ్ పోటీపడనున్నారా?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి మిత్రులు అన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ స్నేహం ఆఫ్ స్క్రీన్ వరకే పరిమితం. త్వరలో ఈ ఇద్దరూ తమ సినిమాలతో పోటీపడే అవకాశముందని ఫిల్మ్‌నగర్ లో కథనాలు వినిపిస్తున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. ఇటీవలే జైలవకుశతో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఆ చిత్రం తరువాత తన తదుపరి సినిమాని త్రివిక్రమ్‌తో చేయనున్నాడు తారక్. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని విజయదశమి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సుకుమార్‌తో రంగస్థలం 1985 చేస్తున్నాడు. ఈ చిత్రం వేసవి కానుకగా విడుదల కానుంది.
అయితే ఆ తరువాత బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ మాస్ మసాలా మూవీ చేయనున్నాడు చెర్రీ. జనవరిలో సెట్స్‌పైకి వెళ్లే ఈ సినిమాని కూడా దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందని సమాచారమ్. సో.. తారక్, చరణ్‌ల తొలి పోటీకి రంగం సిద్ధమౌతోందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments