ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా...నితిన్...?
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ తో సినిమా చేయాలని మల్లిడి వేణు అనే యువ దర్శకుడు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. మల్లిడి వేణు చెప్పిన కథ నచ్చి నితిన్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. నితిన్ కి కథ చెప్పక ముందు మల్లిడి వేణు చాలా మందికి చెప్పాడు. కానీ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హమ్మయ్య సినిమా చేస్తున్నాం అనుకున్నాడు.
కానీ ఇంతలోనే నితిన్ మల్లిడి వేణుతో మన ప్రాజెక్ట్ కన్న ముందు ఓ సినిమా చేసి తర్వాత మన సినిమా చేద్దాం అన్నాడు. మల్లడి చేసేదేం లేక ఒకె అన్నాడు. నితిన్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ మల్లిడి మాటే మరచిపోయాడట.
నితిన్ ....పూరితో సినిమా చేయడానికి ప్లాన్ చేసాడు. కానీ ఊహించని కారణాల వలన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో నితిన్ కి...సినిమా చేస్తానని మాటిచ్చిన మల్లిడి వేణు గుర్తుకు వచ్చాడట. స్ర్కిప్ట్ రెడీ చేయ్ సెట్స్ పైకి వెళిపోదాం అన్నాడు. ఇంకేముంది మల్లిడి వేణు ఎగిరి గంతేసాడు. ఆఫీస్ తీసారు. స్ర్కిప్ట్ పని స్టార్ చేసాడు. ఇంతలో...మరోసారి బ్యాడ్ లక్. ఈసారి త్రివిక్రమ్ రూపంలో వచ్చింది. త్రివిక్రమ్ సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత ఓ చిన్న సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు అని తెలిసింది. అంతే నితిన్ తన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి త్రివిక్రమ్ తో సినిమా కన్ ఫర్మ్ చేసుకున్నాడు. ఈ సినిమా ఈ నెల మూడోవారంలో ప్రారంభించనున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా మల్లిడి వేణుతో సినిమా చేస్తానంటున్నాడు. మరి..ఈసారైనా నితిన్ మాట నిలబెట్టుకుంటాడా..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments