నిహారిక ఆ..పాత్ర చేస్తుందా..

  • IndiaGlitz, [Monday,July 18 2016]

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన క‌థానాయిక నిహారిక‌. తొలి చిత్రం ఒక మ‌న‌సు ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో నిహారిక రెండో చిత్రం విష‌యంలో ఆలోచ‌న ప‌డింది అంటూ వార్త‌లు వ‌చ్చాయి. కానీ...మ‌రాఠీ మూవీ హ్యాపీ జ‌ర్నీ తెలుగు రీమేక్ లో న‌టించేందుకు నిహారిక అంగీక‌రించింద‌ట‌.

అయితే...ఈ చిత్రంలో నిహారిక దెయ్యం పాత్ర పోషిస్తుంద‌ట‌. ఇది అన్నా చెల్లెల అనుబంధం ప్ర‌ధానంగా సాగే విభిన్న క‌థతో రూపొందింది. చెల్లెలు చ‌నిపోయిన త‌ర్వాత కూడా అన్న పై ప్రేమ‌తో అక్క‌డే ఉండి అన్న‌కు స‌హాయం చేసే క్యారెక్ట‌ర్ కావ‌డంతో...న‌ట‌న‌కు అవ‌కాశం ఉంటుంద‌ని ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి ఓకే చెప్పింద‌ట‌. అన్న‌య్య క్యారెక్ట‌ర్ ను హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే పోషిస్తున్న‌ట్టు తెలిసింది. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కుడు, మిగిలిన న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో ఎనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.