నయన కోరిక తీరుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
లేడీ సూపర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే నయనతార తెలుగు, తమిళ చిత్రాల్లో బిజీగా ఉంది. ఈ అమ్మడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో నటిస్తుంది.. అలాగే తమిళంలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలతో పాటు శివకార్తీకేయన్, విజయ్ సేతుపతి వంటి హీరోలతో సినిమాలు చేయనుంది. కాగా .. రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నయనతార తన కోరికను తెలియజేసింది.
అదేంటంటే.. ఆమెకు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలనుందట. అయితే ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఆ పాత్రను బాలీవుడ్ హీరోయిన్‌తో చేయించాలనుకుంటున్నారు. మరి నయన కోరికను తీర్చెదెవరలో తెలియాలంటే వేచి చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com