నాని కూడా చేరుతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
దిల్ రాజు.. సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రొడ్యూసర్ పేరిది. కొత్త దర్శకులతో ఎక్కువ విజయాలను అందుకున్న వైనం రాజు సొంతం. ఇదిలా ఉంటే.. దిల్ రాజు ఈ సంవత్సరం ఏకంగా ఆరు చిత్రాలను నిర్మించి వార్తల్లోకెక్కారు. ఈ ఏడాదిలో ఆయన నిర్మించిన ఆరో సినిమాగా ఎంసిఎ డిసెంబర్ 21న విడుదల కానుంది.
నాని, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. దిల్ రాజు సంస్థలో రెండో చిత్రం చేసిన కథానాయకుల్లో.. రెండో ప్రయత్నంలో సక్సెస్ అందుకున్నవారే ఎక్కువ శాతం ఉన్నారు.
అల్లు అర్జున్ (పరుగు), రవితేజ (రాజా ది గ్రేట్), ప్రభాస్ (మిస్టర్ పర్‌ఫెక్ట్), సాయిధరమ్ తేజ్ (సుప్రీమ్).. ఈ జాబితాలో ఉన్న కథానాయకులు.
మరి ఇప్పటికే దిల్ రాజు సంస్థలో నేను లోకల్ రూపంలో ఓ హిట్ అందుకున్న నాని.. రెండో చిత్రం విషయంలోనూ సక్సెస్ అందుకుంటే గనుక పై జాబితాలో చేరుతాడు. మరి నాని ఈ లిస్ట్‌లో చేరుతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com