నాని కూడా చేరుతాడా?

  • IndiaGlitz, [Monday,December 18 2017]

దిల్ రాజు.. స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ప్రొడ్యూస‌ర్ పేరిది. కొత్త ద‌ర్శ‌కుల‌తో ఎక్కువ విజ‌యాల‌ను అందుకున్న వైనం రాజు సొంతం. ఇదిలా ఉంటే.. దిల్ రాజు ఈ సంవ‌త్స‌రం ఏకంగా ఆరు చిత్రాల‌ను నిర్మించి వార్త‌ల్లోకెక్కారు. ఈ ఏడాదిలో ఆయ‌న నిర్మించిన ఆరో సినిమాగా ఎంసిఎ డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది.

నాని, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక్క‌డ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. దిల్ రాజు సంస్థ‌లో రెండో చిత్రం చేసిన క‌థానాయ‌కుల్లో.. రెండో ప్ర‌యత్నంలో స‌క్సెస్ అందుకున్న‌వారే ఎక్కువ శాతం ఉన్నారు.

అల్లు అర్జున్ (ప‌రుగు), ర‌వితేజ (రాజా ది గ్రేట్‌), ప్ర‌భాస్ (మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌), సాయిధ‌ర‌మ్ తేజ్ (సుప్రీమ్‌).. ఈ జాబితాలో ఉన్న క‌థానాయ‌కులు.

మ‌రి ఇప్ప‌టికే దిల్ రాజు సంస్థ‌లో నేను లోక‌ల్ రూపంలో ఓ హిట్ అందుకున్న నాని.. రెండో చిత్రం విష‌యంలోనూ స‌క్సెస్ అందుకుంటే గ‌నుక పై జాబితాలో చేరుతాడు. మ‌రి నాని ఈ లిస్ట్‌లో చేరుతాడో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

జనవరిలో విడుదలకు సిద్ధమైన 'శరభ'

ఏ.కె.ఎస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆకాష్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎన్.నరసింహారావు తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'శరభ'.

చ‌రణ్‌తో బాలీవుడ్ న‌టుడు...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా జ‌న‌వ‌రి నుండి బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య‌ల‌కు చిరంజీవి 4ల‌క్ష‌లు ఆర్ధిక‌ స‌హాయం

క‌మెడియ‌న్ గుండు హ‌నుమంతురావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధప‌డుతోన్న నేప‌థ్యంలో టెలివిజ‌న్ లో ప్ర‌సార‌మ‌య్యే 'అలీతో జాలీ'గా షో ద్వారా గుండు ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి 2ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను  'మా' మూవీ ఆర్టిస్ట్  అసోసియేష‌న్ అధ్య‌క్షుడు శివాజీ రాజా ద్వారా అంద‌జేశారు.

జో పాత్ర మెప్పిస్తుందంటున్న సురభి

ఉషాకిరణ్ మూవీస్ వారి బీరువా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ సుందరి సురభి.

సాయిధరమ్ కి ఈ సారైనా కలిసొస్తుందా?

సుప్రీమ్ తరువాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్.