'నక్షత్రం' తో కొనసాగేనా
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రియ.. ఒకప్పుడు అగ్ర కథానాయకులందరితోనూ జోడీ కట్టి మెప్పించిన కథానాయిక. మధ్యలో కొన్ని పరాజయాలు పలకరించినా.. ప్రత్యేక గీతాలతో ఆకట్టుకుంది. ఒకటీఅరా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అదృష్టం పరీక్షించుకుంది. ఫైనల్‌గా 'మనం' సినిమాతో మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చిన ఈ ఢిల్లీ డాళ్.. ఆ తరువాత 'గోపాల గోపాల, ఊపిరి (అతిథి పాత్ర), గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి విజయవంతమైన చిత్రాలతో సందడి చేసింది.
అంటే.. 'మనం' తరువాత శ్రియకి తెలుగులో మళ్లీ సక్సెస్‌ఫుల్ ఇన్నింగ్స్ మొదలైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చాలా కాలం తరువాత 'నక్షత్రం'లో ఐటమ్ సాంగ్ చేసింది శ్రియ. ఈ సినిమాతోనూ తన విజయాల పరంపరని కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఈ శుక్రవారం విడుదల కానున్న 'నక్షత్రం' విజయం.. దర్శకుడు కృష్ణవంశీ నుంచి హీరోహీరోయిన్లు సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్ వరకు అందరికీ కీలకం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com