అఖిల్ చిత్రంలో నాగ్ ? చైతూ?

  • IndiaGlitz, [Wednesday,September 30 2015]

అఖిల్‌ అక్కినేని ని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం అఖిల్‌'. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 22న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత నితిన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ సినిమా ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ లో నాగార్జున‌, నాగ‌చైత‌న్య ఇద్ద‌రూ న‌టిస్తున్నారు. త‌మ అక్కినేని ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న అఖిల్ ను ఆద‌రించ‌మ‌ని ఫ్యాన్స్ ను అడిగే స‌న్నివేశంలో ఈ షాట్ ఉంటుంద‌ట‌. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. మ‌రోవైపు విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర పడుతుండ‌టంతో ప్ర‌చారం కూడా విరివిగా చేస్తున్నారు. ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్‌, కోన వెంకట్‌, అనూప్‌, థమన్‌, అమోల్‌ రాథోడ్‌, రవివర్మ, ఎ.ఎస్‌.ప్రకాష్‌, గౌతంరాజు, భాస్కరభట్ల, కృష్ణచైతన్య, శేఖర్‌, గణేష్‌, జాని సాంకేతిక నిపుణులు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకటరత్నం(వెంకట్‌), సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: నితిన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.