నాగ్ ఒప్పుకుంటాడా..?

  • IndiaGlitz, [Monday,November 28 2016]

'ఓం న‌మో వేంక‌టేశాయ' సినిమా త‌ర్వాత అక్కినేని నాగార్జున హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ 'రాజుగారి గ‌ది 2' సినిమాతో బిజీ అవుతున్నాడు. డిసెంబ‌ర్ నుండి రాజుగారి గ‌ది2 రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో పివిపి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో నటించ‌బోతున్నాన‌ని నాగార్జున చెప్ప‌డం విశేషం.

ఈ సినిమాలో నాగార్జున క్యారెక్ట‌ర్ కోసం ద‌ర్శ‌కుడు ఓంకార్ నాగ్ క్యారెక్ట‌ర్ కోసం ఫ్రెంచ్ క‌ట్‌, గుండుతో ఉన్న స్కెచ్ గీయించాడ‌ట‌. మ‌రి గుండులో నాగార్జున ఒప్పుకుంటాడా అనే ఆలోచించాల్సిన విష‌య‌మే. క‌థ‌లో కొత్త‌ద‌నాన్ని కోరుకునే నాగ్‌..మ‌రో అడుగు ముందుకేసి లుక్ ప‌రంగా కూడా గుండుతో క‌నిపిస్తాడా చూడాలి. ఒక‌వేళ నాగార్జున గుండుతో క‌నిపిస్తే వైవిధ్యత కోసం ముందుడుగు వేసిన స్టార్ హీరో అవుతాడు.