ఇంద్రగంటి అదే ఫాలో అవుతారా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఓ సినీ తారకి, సినిమాలంటే అస్సలు ఇష్టం లేని ఓ యువకుడికి మధ్య సాగే ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం సమ్మోహనం. సుధీర్ బాబు, అదితి రావ్ హైదరీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. అలాగే మంచి రివ్యూస్ కూడా ఇచ్చాయి. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి.. ఇంద్రగంటి గత రెండు చిత్రాలు జెంటిల్ మన్, అమీ తుమీ కూడా జూన్ నెలలోనే విడుదలవడం.
2016లో జూన్ 17న జెంటిల్ మన్ రిలీజ్ కాగా.. 2017లో జూన్ 9న అమీ తుమీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు సమ్మోహనం కూడా అదే జూన్ నెలలో రిలీజ్ కావడం.. వరుసగా మూడో సంవత్సరంలోనూ విజయం దక్కడం విశేషం. మొత్తానికి.. ఇంద్రగంటికి జూన్ నెల బాగానే అచ్చొచ్చింది. తదుపరి చిత్రం విషయంలోనూ ఇదే ఫార్ములాని ఆయన ఫాలో అవుతారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com