రంగంలోకి దిగిన అమెరికా.. మసూద్ అజార్ కథ ముగిసినట్లేనా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కథ ముగిసనట్లేనా..? ఆయనకు గడ్డుకాలం దగ్గరపడిందా..? ఆయనకున్న దారులన్నీ మూసుకుపోయినట్లేనా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తోంది. మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చి తీరుతామని అగ్రరాజ్యం అమెరికా మరోసారి తేల్చిచెప్పింది. కాగా.. మసూద్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆంక్షల కమిటీని అతిక్రమించి అమెరికా చర్యలు చేపడుతోందని చైనా ఇటీవల ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఇందుకు స్పందించిన యూఎస్ ఆరోపణలను తిప్పి కొట్టడంతో పాటు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామని అమెరికా తేల్చిచెప్పింది.
ఇదిలా ఉంటే.. ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో చేర్చాలన్న బారత్ ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో 14 దేశాలు మద్దతు ఇస్తుండగా, వీటో అధికారం ఉన్న చైనా మాత్రం మోకాలడ్డుతున్న విషయం తెలిసిందే. దీంతో మసూద్ అజార్‌కు ఉన్న దారులన్నీ దాదాపు మూసుకుపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా దూకుడుతో చైనా ఆగ్రహంతో రగిలిపోతోంది.
అమెరికా ప్రతినిధి ఏం చెప్పారు..!?
‘అంతర్జాతీయ సమాజంలో మసూద్ అజార్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు మేం, మా మిత్రదేశాలు, ఐరాస భద్రతామండలిలోని దేశాలు కలిసి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటాం. ఇందుకోసం యూకే, ఫ్రాన్స్ సహకారంతో సరికొత్త తీర్మానం రూపొందించాము. ఇటీవలే దాన్ని ఐరాస భద్రతామండలి సభ్య దేశాలకు పంపించాము. ఈ తీర్మానంతో ఐక్యరాజ్యసమితిని తక్కువ చేస్తున్నామని చైనా వాదించడం సరికాదు"అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు.
9 ఓట్లు వస్తే చాలు..!
ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించిన పుల్వామా దాడి తర్వాత మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికాతో పాటు పలు రాష్ట్రాలు గట్టిగా పట్టుబట్టిన విషయం విదితమే. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో 14 ఆమోదించగా.. ఒక్క చైనా మాత్రం నిలిపివేయడం గమనార్హం. చైనా-పాక్‌కు మంచి సత్సంబంధాలు ఉండటంతో ఇలా ఆ ఉగ్రమూకను వెనకేసుకుని వస్తోందని మిగిలిన దేశాలన్నీ దుమ్మెత్తి పోశాయి. అయితే మసూద్ అంతు చూడాలని భావిస్తున్న అమెరికా మాత్రం మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాల్సిందేనని ఒక తీర్మానాన్ని తయారుచేసి సభ్య దేశాలన్నింటికి పంపింది. కాగా.. తాజాగా అమెరికా లేవనెత్తిన ఈ తీర్మానానికి అనుకూలంగా కేవలం 9 ఓట్లు వస్తే చాలు. ఏకగ్రీవ తీర్మానం అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.
అయితే.. చైనా మాత్రం అమెరికాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీరు చేస్తున్న పనులతో మసూద్ వ్యవహారం పూర్తి కానే కాదని.. ఇలా బలవంతంగా ఆమోదించడం సబబు కాదని అమెరికా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిదని చైనా పత్యం చూపిస్తోంది. అయితే అమెరికా మాత్రం ఆ 9 ఓట్లు కోసం వేచి చూస్తోంది. ఆ ఓట్లు కాస్త వచ్చిన మున్ముంథు అమెరికా ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments