నిర్మాతపై మహేష్ లీగల్ యాక్షన్ తీసుకోనున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్ నిర్మాతలపై లీగల్ యాక్షన్ తీసుకోనున్నాడా? అంటే అవుననే వార్తలు బలంగా వినపడుతున్నాయి. అసలు విషయమేమంటే మహేష్ సైనికుడు సినిమాను సీనియర్ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. ఆ సినిమాతో ఆయనకు నష్టాలు వచ్చాయి. అందుకోసం మరో సినిమా చేస్తానని అప్పట్లో మహేష్ మాట ఇచ్చాడు. దాన్ని మహర్షి సినిమాతో పూర్తి చేసుకున్నాడు. ప్రామిస్‌ను నిలబెట్టుకోవడానికి మహేష్ తన 25వ చిత్రం `మహర్షి` నిర్మాణంలో అశ్వినీదత్‌కు భాగస్వామ్యాన్ని కల్పించారు.
అశ్వినీదత్ నిర్మాణంలో డబ్బులు మాత్రమే పెట్టాలని, జోక్యం చేసుకోకూడదనేది కండీషన్‌గా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అశ్వనీదత్ సినిమా విడుదల వచ్చేసరికి పేచీ ప్రారంభించాడు. తనకు కృష్ణాజిల్లా హక్కులు కావాలని గొడవ చేశాడు. అయితే మహేష్, నిర్మాత దిల్‌రాజు అశ్వినీదత్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో అశ్వినీదత్‌తో కలిసి పనిచేయనని మహేష్ చెప్పాడని కూడా టాక్. అయితే అశ్వినీదత్‌పై లీగల్‌గా చర్యలు తీసుకోవాలని మహేష్ భావిస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments