లేడీ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి మహేశ్ ఓకే చెబుతాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ స్క్రిప్ట్ విషయంలో చాలా పర్టికులర్. ఎంత మంచి స్నేహితుడైనా ఆయనతో సినిమా చేయాలంటే స్క్రిప్ట్ బాగుంటేనే ఓకే అంటాడు. లేకుంటే లేదు. అలాంటిది మహేశ్ ఓ డైరెక్టర్‌తో పనిచేయాలని కోరుకోవడమే కాదు.. స్క్రిప్ట్ తయారు చేయమని కూడా కోరాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు మహిళా దర్శకురాలు సుధా కొంగర. గత ఏడాది ఈమె సూర్య హీరోగా డైరెక్ట్ చేసిన ‘ఆకాశం నీ హద్దురా..’ సినిమా ప్రేక్షకుల మన్ననలే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఏకంగా ఆస్కార్ రేసులోనూ మన దేశం తరపున పోటీ కూడా పడుతుంది.
సుధా కొంగర ఆ సినిమాను డీల్ చేసిన తీరు నచ్చిన మహేశ్.. సుధా కొంగరకు స్క్రిప్ట్ రెడీ చేస్తే వింటానని చెప్పాడట. ఇప్పుడు సుధా కొంగర.. మహేశ్ కోసం కథను సిద్ధం చేస్తుందట. త్వరలోనే మహేశ్‌ను సుధా కొంగరను కలిసే అవకాశం ఉందట. ప్రస్తుతం మహేశ్ తన 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణలో బిజి బిజీగా ఉన్నాడు. పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout