మహేష్ మళ్లీ చేస్తాడా

  • IndiaGlitz, [Tuesday,August 11 2015]

గుణా టీమ్ వర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాత గుణశేఖర్ రుద్రమదేవి' పేరుతో తొలి హిస్టారికల్ త్రీడీ మూవీ నిర్మించాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 4న కానుంది. అయితే తెలుగు ఖ్యాతిని ప్రపంచనానికి చాటిన రాజుల్లో కాకతీయులు ఒకరు. వారిలో ప్రతాపరుద్రుడు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని కొడుకు గణపతి దేవుడు, మనవరాలు రుద్రమదేవి. ప్రస్తుతం గుణశేఖర్ రుద్రమదేవి సినిమాని రూపొందించాడు.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం విడుదల కాకముందే గుణా టీమ్ వర్స్స్ బ్యానర్ పై ప్రతాపరుద్రుడు' అనే టైటిల్ రిజిష్టర్ చేయించారు. అలాగే సినిమా రుద్రమదేవికి సీక్వెల్ గా తెరకెక్కిస్తారని కూడా వార్తలు వినపడుతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రతాపరుద్రుడుగా నటిస్తే బావుంటుందని అనుకుంటున్నాడట. మరి కథ విని మహేష్ బాబు అంగీకరిస్తాడో లేదో చూడాలి...