తెలంగాణలో ఆక్టోపస్ అట్టర్ ప్లాప్.. ఏపీలో పరిస్థితేంటి!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో అధికారంలోకి ఎవరొస్తారో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తేల్చిచెప్పేశారు. ఇప్పటికే శనివారం రోజు కాస్త క్లూ ఇచ్చిన లగడపాటి.. ఆదివారం సర్వే ఫలితాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం ప్రెస్మీట్ నిర్వహించిన లగడపాటి ఏపీ ప్రజలు మరోసారి టీడీపీకే పట్టం కట్టారని తేల్చేశారు.
ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే ప్రకారం.. ఎవరికెన్ని అసెంబ్లీ సీట్లు
టీడీపీ 100 (+/-) 10
వైసీపీ 72 (+/-) 7
ఇతరులు 03 (+/-) 2
పార్లమెంట్ సీట్లు:-
టీడీపీ 15 (+/-) 2
వైసీపీ 10 (+/-) 2
ఇతరులు 01
అసెంబ్లీ ఓట్ల శాతం..
టీడీపీ ఓట్ల శాతం 43- 45 %
వైసీపీ ఓట్ల శాతం 40- 42 %
జనసేన ఓట్ల శాతం 10-12 %
పార్లమెంట్ ఓట్ల శాతం..
టీడీపీ ఓట్ల శాతం 43- 45 %
వైసీపీ ఓట్ల శాతం 40.5- 42.5 %
జనసేన ఓట్ల శాతం 10- 12 %
లగడపాటి మాటల్లోనే...
" శాస్త్రీయ పద్ధతిలో జరిగిన సర్వే వివరాలను ప్రకటిస్తున్నాను. టీడీపీకి మరోసారి అవకాశం ఇవ్వాలన్న కోరికతో ఏపీ ప్రజలు ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంగా గట్టిపోటీ ఇచ్చింది.. ఆ పార్టీ అధికారంలోకి రాకపోయినా సీట్ల సంఖ్య గణనీయంగా రావొచ్చు. పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన’ మూడో స్థానంలో ఉంది. ఆ పార్టీ ఒక్కో జిల్లాలో ఒక్కోలా ప్రభావం చూపినట్టు మా సర్వేలో తేలింది.
తెలంగాణలో పరిస్థితేంటి..?
తెలంగాణలో టీఆర్ఎస్ 14నుంచి 16 స్థానాల్లో గెలుస్తుందని.. కాంగ్రెస్కు 0 నుంచి 2 వరకు రావచ్చు లేదా ఏమీ రాకపోవచ్చని రాజగోపాల్ తేల్చిచెప్పారు. బీజేపీకి 0 నుంచి 1 సీటు వచ్చే అవకాశాలున్నాయని ఆక్టోపస్ జోస్యం చెప్పారు. ఒక సీటు మాత్రం ఎంఐఎంకు వస్తుంది.. ఇది అనాధిగా వస్తూ ఉన్నదన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ మద్దతిచ్చారని ఆయన చెప్పారు.
కాగా.. తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని లగడపాటి జోస్యం చెప్పారు. కానీ ఆ సర్వే అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు ఏపీలో ఆక్టోపస్ ఫలితాలు ఏ మాత్రం ఫలిస్తాయో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తుది ఫలితాలు తేలాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com