జనసేనలోకి లగడపాటి రాజగోపాల్ ..!?

  • IndiaGlitz, [Thursday,January 31 2019]

ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగపాటి రాజగోపాల్ జనసేన తీర్థం పుచ్చుకోనున్నారా..? టీడీపీ, వైసీపీలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో లగడపాటి జనసేనలో చేరాలనుకుంటున్నారా..? విజయవాడ ఎంపీ సీటు కావాలని గట్టిగా పట్టుబట్టిన ఆయనకు జనసేనాని హామీ ఇచ్చారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది.

అప్పుడెప్పుడో తెలంగాణ ఫలితాల ముందు మీడియా ముందుకొచ్చిన లగడపాటి ఇటీవల మరోసారి మైకు గొట్టాల ముందుకొచ్చారు. వచ్చీ రాగానే తెలంగాణ ఎన్నికల తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన త్వరలోనే నిజానిజాలన్నీ ఆధారాలతో బయటపెడతానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ‘మీరు జనసేనలో ఎప్పుడు చేరబోతున్నారు సార్’ అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన నవ్వుతూ బదులివ్వడం గమనార్హం. ఆయన మీడియాకిచ్చిన సమాధానం బట్టి చూస్తే జనసేన తీర్థం పుచ్చుకునేలానే ఉందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాగా ఫిబ్రవరి-1న రీఎంట్రీపై క్లారిటీ ఇస్తానన్న లగడపాటి.. జనసేనలో చేరతానని ప్రకటించబోతున్నట్లు సమాచారం.

మీకు చెప్పే జాయిన్ అవుతా..!
నేను ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్నాను. రీ ఎంట్రీ ఇవ్వానుకున్నప్పుడు కచ్చితంగా మీ అందరికీ చెప్పే చేస్తాను కానీ చాటు మాటుగా చేసే వ్యక్తిని కాదు. మీడియా వాళ్లంతా మీకు మీరే నిర్ణయించుకుని టీడీపీలోకి ఎప్పుడొస్తారు..? ముహూర్తం ఎప్పుడు..? అని ఐదేళ్ల నుంచి రకరకాలుగా కథనాలు అల్లేస్తున్నారు. ఒక్క టీడీపీనేకాదు వైసీపీ, కాంగ్రెస్‌‌లోకి వెళ్తారని.. అంతేకాదు నియోజకవర్గాలు కూడా మీరే ఫిక్స్ చేసేశారు.. అని నవ్వుతూ లగడపాటి చెప్పుకొచ్చారు.

మొత్తానికి చూస్తే.. జనసేన తీర్థం పుచ్చుకోవడానికే లగడపాటి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేనలో ఉన్న తన ఆప్తమిత్రుడితో రాయబారం నడిపినట్లుగా వార్తలు వినవస్తున్నాయి. విజయవాడ ఎంపీ టికెట్ లేదా రాజ్యసభ టికెట్ ఇస్తే తాను పవన్ సమక్షంలో పార్టీలో చేరతానని లగడపాటి.. ఆప్తుడితో చెప్పారని టాక్. అయితే ఇది ఎంత వరకు నిజమవుతుంది..? నిజంగానే ఆయన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌‌లను వదిలి జనసేనలో చేరుతారా..? లేకుంటే పర్మినెంట్‌‌గా రాజకీయాలకు దూరంగా ఉంటూ సర్వేలు చేసుకుంటారా..? అనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

More News

నుమాయిష్‌‌లో 150 దుకాణాల బుగ్గి.. 100 కోట్లు నష్టం

హైదరాబాద్‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్స్‌ గ్రౌండ్‌‌లో బుధవారం రాత్రి సంభవించిన అగ్ని్ప్రమాదానికి 150 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన దుకాణాలు

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం థాటికి గ్రౌండ్‌‌లో ఉన్న పలు దుకాణాల్లో మంటలు చెలరేగాయి.

అనంతకు 'కియా' తెచ్చిన ఘనత మోదీదే.. ఇదిగో ఆధారాలు!

అనంతకు ‘కియా’ రాకతో నవ్యాంధ్రకు పారిశ్రామిక కళ వచ్చింది..! ‘కియా’ రాక ఓ చరిత్ర..! కరువు జిల్లా అనంతపురం ఇక ఉద్యోగులతో కలకలాడుతుందని అందరూ చెప్పుకుంటున్నారు

కడప జిల్లాలో కేసీఆర్ ఎన్నికల సర్వే..!?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడప జిల్లాలో.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల సర్వే నిర్వహించారా..?

హీరోయిన్ల పై సింగర్ ఎస్పీ బాలు బోల్డ్ కామెంట్స్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్స్‌‌పై బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ మాటలు విన్న సినీ ప్రియులు, నటీనటులు సైతం ఒకింత అవాక్కయ్యారు.