'లేడీ సెంటిమెంట్‌' పవన్‌కు ప్లస్ అవుతుందా!?

  • IndiaGlitz, [Saturday,February 02 2019]

జనసేనలో ఇంత వరకూ బూత్‌ స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని.. ఈ దేశ రాజకీయాలు అభివృద్ధి కాముకులైన మేధావులతో ఉండాలని, లాభాపేక్షలేని రాజకీయాలు దేశ యవనికపై నడియాడాలని.. అందుకు తనవంతుగా కృషి చేస్తూ పవన్ ముందుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళా శక్తికి రాజకీయ సాధికారిత అందించాలన్న తలంపుతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమకాలిన రాజకీయ పార్టీలకు భిన్నంగా, భవిష్యత్ భారతావని అవసరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ జనసేన కమిటీలను ఏర్పాటు చేశారు.

22 కమిటీలతో పవన్ తొలి జాబితాను విడుదల చేశారు. తొలుత ఆడపడుచులతో కమిటీలు ఏర్పాటు చేయడం శుభప్రదంగా, సెంటిమెంట్‌గా కలిసొస్తుందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న మహిళలకు జనసేనలో ఆయన సముచిత స్థానం కల్పించారు. కాగా.. ప్రస్తుతం జనసేనలో పదవులు పొందిన వారంతా నవవయస్కులు, విద్యాధికులు, డాక్టర్లు, లెక్చరర్లు, న్యాయవాదులు, ఐటీ నిపుణులు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే పలువురు తమ ఉద్యోగాలను కూడా వదులుకొని ప్రజా సేవ కోసం జనసేనలో చేరి తమ వంతుగా కృషి చేస్తున్నవారు ఉండటం విశేషం. కాగా ఈ కమిటీల్లో రాజకీయ అనుభవం లేకపోయినా నిబద్ధత కలిగిన వారికి స్థానం కల్పించడం జరిగింది.

వీరమహిళ కమిటి..:
వీరమహిళకు చైర్మన్‌: జవ్వాజి రేఖ (25) కర్నూలు
వైస్ చైర్మన్లు: సింధూరి కవిత (25), షేక్ జరీనా (28), నూతాటి ప్రియా సౌజన్య (30), శ్రీవాణి (47)

పొలిటికల్ అఫైర్స్ కమిటీ:
పొలిటికల్ అపైర్స్ కమిటీ చైర్మన్: సుజాత పాండా (శ్రీకాకుళం)
పాలసీ వింగ్ చైర్మన్‌: యామినీ జ్యోత్సా కంబాల
పార్లమెంటరీ వర్కింగ్ కమిటీల వనితలు: షాహిన్ సయ్యద్, షేక్ రజియా, మంజుల సునీత, సావిత్రి, వాశిలి తుషార బిందు

క్యాంపెయినిగ్ అండ్ పబ్లిసిటీ విభాగం:
క్యాంపెయినిగ్ అండ్ పబ్లిసిటీ విభాగం చైర్మన్‌: ఉషశ్రీ (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి)
జై కిసాన్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ: లక్ష్మి కుమారి
పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌: పద్మావతి
సోషల్ మీడియా కో-ఆర్డినేటర్: రజిత

అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ:
చైర్మన్: జయ కళ్యాణి కూరెళ్ల
సెంట్రల్ కమిటీ ఫర్ పార్టీ అఫైర్స్: చెరకుపల్లి శ్రావణి

సెంట్రల్ ఆఫీస్ గ్రీవెన్స్ కమిటీ:
శ్యామల, రత్నమాల రెడ్డి, విజయలక్ష్మి, పద్మ, ధనలక్ష్మి
కమ్యూనిటీ అండ్ సోషల్ జస్టిస్ వింగ్‌: జానీబేగం
లాజిస్టిక్స్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ కమిటీ: స్వరూపా దేవి
ఆర్గనైజింగ్ సెక్రటరీలు: సాయి తేజస్వి, సౌజన్య, కే. పద్మ
కాన్‌స్టిట్యూషన్ అండ్ సివిల్ రైట్స్ విభాగం వైస్ చైర్మన్‌: కవిత

పార్టీ ఐడియాలజీ వింగ్:
సుధేష్ణ వల్లూరి, రమ్య కవిత పోతరాజు, జవ్వాది విష్ణు ప్రియాంక, వెంకటసృజన ప్రియ

ప్రోటోకాల్స్ కమిటీ:
లిఖిత తాడికొండ, శివరాణి గన్నవరపు, శివపార్వతి, శ్రీదేవి
ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం స్పోక్స్ పర్సన్‌: వాణిశ్రీ

మొత్తానికి చూస్తే.. జనసేన మొదటి అడుగు మహిళలతోనే పడింది. మిగతా పార్టీలతో పోలిస్తే మొత్తం అందర్నీ యంగ్ అండ్ డైనమిక్ వాళ్లే జనసేనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే లేడీ సెంటిమెంట్‌తో ముందుకెళ్తున్న పవన్‌కు ఏ మాత్రం కలిసొస్తుంది..? అనే విషయాలు తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.