కేసీఆర్ లాస్ట్ పంచ్‌తో జగన్‌కు లాభమేనా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే అనే సామెత ఎన్నోసార్లు వినేవుంటాం. అందుకే ఏపీ సీఎం చంద్రబాబుకు శత్రువు.. రాజకీయ ప్రతర్థి అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంచుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో వేలుపెట్టిన చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకోవడానికి రిటర్న్ గిఫ్ట్ రూపంలో జగన్‌కు గులాబీ బాస్ సపోర్ట్ చేస్తున్నారు. అవసరమైతే ఏపీకి వెళ్లి మరీ ప్రచారం చేస్తానని పలుమార్లు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. అయితే ప్రచారానికెళితే ఎక్కడ జగన్‌కు వస్తుందో అని గ్రహించి వెళ్లలేదు.
అయితే దీన్నే అదునుగా తీసుకున్న సీఎం చంద్రబాబు ఇప్పటి వరకూ నిర్వహించిన బహిరంగ సభల్లో అటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉతికి ఆరేస్తున్నారు. స్వయానా ఆయనే.. కేసీఆర్‌ను వారం రోజులనుంచి బట్టలు ఉతికినట్లు ఉతికి ఆరేస్తున్నానని చంద్రబాబు గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే అంతకముందు వికారాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకూ తనపై చంద్రబాబు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ స్పందించని కేసీఆర్ ఎట్టకేలకూ లాస్ట్ అండ్ ఫైనల్ పంచ్ ఇచ్చేశారు.
అందరి దృష్టిని ఆకర్షించిన కేసీఆర్...
"ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మాకు ఎలాంటి ఇబ్బందిలేదు. ఇందుకోసం మేం కూడా సహకరిస్తాం. పోలవరం ప్రాజెక్టుకు మేం అడ్డుకాదు. మమ్మల్ని ముంచొద్దని మాత్రమే కోరుతున్నాము. ఏపీలో చంద్రబాబు పనైపోయిందని... అక్కడ విజయం సాధించబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డే. మన ఎంపీ సీట్లతోపాటు ఏపీలో జగన్ గెలవబోయే సీట్లను కలుపుకొని ప్రత్యేక హోదా సాదిద్దాం" అని మాట్లాడిన కేసీఆర్ మాటలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయడంతో పాటు అందరి దృష్టిని ఆకర్షింపజేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
పవన్ గురించి మాట్లాడని కేసీఆర్..!
కాగా... ఇప్పటి వరకూ ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికలకు సమయం ఆసన్నం కావడం మరోవైపు పదేపదే తన పేరు ప్రస్తావిస్తున్నప్పటికీ స్పందించకపోతే బాగోదని భావించిన గులాబీ బాస్ ఎట్టకేలకు స్పందించి చంద్రబాబు దుమ్ముదులిపి వదిలారు. కాగా ప్రత్యేక హోదా, పోలవరం ముఖ్యంగా జగన్ విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా మాట్లాడటం విశేషమనే చెప్పుకోవచ్చు. అయితే పవన్ కల్యాణ్ గురించి కేసీఆర్ మాట్లాడతారని అందరూ భావించారు అయితే చంద్రబాబుపైనే విమర్శలు ఎక్కుపెట్టడం గమనార్హం.
మొత్తానికి చూస్తే కేసీఆర్ బాహాటంగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయని చెప్పుకోవచ్చు. అయితే చివర్లో చేసిన ఈ వ్యాఖ్యలు జగన్‌కు లాభం కలుగుతుందా..? లేదా..? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఫైనల్ పంచ్ ఏపీ రాజకీయాల్లో ఏ మాత్రం వర్కవుట్ అవుతుంది..? కేసీఆర్ పంచ్‌తో జగన్‌కు లాభమా..? చంద్రబాబుకు లాభమా..? అనేది తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout