కార్తికి థియేటర్స్ దొరుకుతాయా?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో కార్తి ఒకరు. ఇప్పుడు ఈ హీరో నటిస్తోన్న చిత్రం 'దేవ్'. అడ్వేంచరస్ రొమాంటిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రజత్ రవిశంకర్ దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కి గల్రాని హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రూ..55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రిన్స్ పిక్చర్స్, ఎస్.లక్ష్మణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఠాగూర్ మధు సొంతం చేసుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే అదే సమయంలో తెలుగులో నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో పార్ట్ యన్.టి.ఆర్ కథానాయకుడు విడుదలై ఉంటుంది.
అలాగే కల్యాణ్ రామ్, కె.వి.గుహన్ కాంబినేషన్‌లో సినిమా రానుంది. కంగనా రనౌత్ మణికర్ణిక కూడా అప్పుడే విడుదలవుతుంది. ఇవి కాక మరిన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి. వీటిని కాదనుకుని కార్తి సినిమాకు థియేటర్స్ దొరకడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com