'జనతాగ్యారేజ్ ' రిలీజ్ డేట్ మారుతుందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం `జనతాగ్యారేజ్`. మోహన్‌లాల్ ఇందులో కీలకపాత్రలో కనపడబోతున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగిన విధంగా మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేస్తారని అనుకున్నారు. అయితే ఇప్పుడు అదే రోజున హృతిక్‌రోషన్ మొహంజదారో, అక్షయ్ రుస్తుం సినిమాలు విడుదలవుతున్నాయి.
మరి హిందీ సినిమాలకు, ఎన్టీఆర్ సినిమాకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అసలు మెళిక ఏంటంటే ఎన్టీఆర్ గత చిత్రం నాన్నకు ప్రేమతో సక్సెస్‌లో ఓవర్సీస్ బిజినెస్ కీలకపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఓవర్సీస్లో ఎన్టీఆర్ ఓవర్సీస్లో గ్రిప్ సాధించినట్టయ్యింది. ఇప్పుడు జనతాగ్యారేజ్ సినిమాను హిందీ సినిమాలతో పాటు రిలీజ్ చేస్తే ఓవర్సీస్లో థియేటర్స్ తక్కువగా దొరికే అవకాశం ఉంది. ఓవర్సీస్లో అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉండదు. దీంతో నిర్మాతలు సినిమా విడుదల విషయంలో పునరాలోచన ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. అందువల్ల సినిమా ఓ వారం రోజులు వెనక్కి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తలకు యూనిట్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments