'జ‌న‌తాగ్యారేజ్'ఆల‌స్యం అవుతుందా?

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ రూపొందుతోన్న చిత్రం జ‌న‌తాగ్యారేజ్'. సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న మూడో చిత్ర‌మిది. ఇందులో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ కీల‌క‌ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. స‌మంత‌, నిత్యామీన‌న్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఈ సినిమాను ఆగ‌స్ట్ 12న విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ కొన్ని అనివార్య కార‌ణాల‌తో సెప్టెంబర్ 2న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబ‌ర్ 2న కూడా విడుద‌ల కాబోదేమోన‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అందుకు ప్రత్యేక కార‌ణముంది. సెప్టెంబ‌ర్ 2న భార‌త్ బంద్ ఉండ‌ట‌మే. ఆరోజు థియేట‌ర్స్ బంద్ ఉంటాయి. కాబ‌ట్టి తొలిరోజు క‌లెక్ష‌న్స్ పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని, దాన్ని బ‌ట్టే రిలీజ్ డేట్ ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూద్దాం...

More News

డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో గోపీచంద్ 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

నీజ‌త‌లేక ప్ర‌మోష‌న‌ల్ టైటిల్ సాంగ్ రిలీజ్

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా పారుల్‌, సరయు హీరోయిన్స్‌గా శ్రీ సత్య విదుర మూవీస్‌ పతాకంపై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్‌ గౌడ్‌ చిర్రా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'నీ జతలేక'. కరుణాకర్‌ కంపోజ్‌ చేసిన ఈ సినిమా ప్రమోషనల్‌ టైటిల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ శనివారం హైదరాబాద్‌ రేడియో సిటీలో విడుదల చేశారు.

చిన్నారి అభిమానిని చూసి చ‌లించిన రామ్‌

రామ్ అనే పేరు విన‌గానే అంద‌రికీ అంద‌మైన కుర్రాడి రూపం క‌ళ్ల‌ముందు క‌దులుతుంది. అంత‌క‌న్నా హుషారుగా ఉండే వ్య‌క్తిత్వం గుర్తుకొస్తుంది. కానీ శుక్రవారం విశాఖ వాసుల‌కు మాత్రం అత‌నిలోని మంచి మ‌న‌సు క‌నిపించింది. చిన్నారి బాధ‌ను చూసి చ‌లించిపోయి కంటికింద చెమ్మై చేరిన అత‌ని ఉదార‌త క‌ళ్ల‌ముందు సాక్షాత్కార‌మైంది. వివ‌రాల్లోకెళ&

బ‌న్ని స్టార్ హీరో కాదా..?

తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అలియాస్ బ‌న్ని మెగా క్యాంప్ హీరో అయినా త‌న‌దైన క‌ష్టంతో ఓ క్రెడిబిలిటీ, ఇమేజ్ సంపాదించుకున్నాడు. అందుకు నిద‌ర్శనం స‌రైనోడు. మిక్స్‌డ్ టాక్ తో స్టార్ అయిన ఈ సినిమా వంద‌కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద బ‌న్ని రేసుగుర్రం అని ప్రూవ్ చేసింది.

అప్పుడు ఎస్.వి.కృష్ణారెడ్డి.. ఇప్పుడు మారుతియా?

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలు తీయడంలో పెట్టింది పేరుగా వరుస విజయాలు అందుకున్న దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి. ఆయన దర్శక్వంలో వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు, యమలీల, ఘటోత్కచుడు, శుభలగ్నం, ప్రేమకు వేళాయెరా, ఎగిరే పావురమా.. ఇలా ఒకటేమిటి ఏ సినిమా చేసిన సూపర్ హిట్టే అనే రీతిలో ఏకబిగిన విజయాలను అందుకున్నాడు.