దేవిశ్రీ విష‌యంలో ఈసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

  • IndiaGlitz, [Tuesday,May 01 2018]

యంగ్ హీరో రామ్‌కు క‌లిసొచ్చిన సంగీత ద‌ర్శ‌కుల‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెడీ, నేను శైల‌జ మంచి విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమా కోసం క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఇది.. ఈ కాంబోలో వ‌స్తున్న ఆరో సినిమా కావ‌డం విశేషం. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం అర్థ‌మ‌వుతుంది.

అదేమిటంటే.. రామ్‌, దేవిశ్రీ కాంబోలో వ‌చ్చిన తొలి చిత్రం జ‌గ‌డం ఫ్లాప్ అయితే.. రెండో చిత్రం రెడీ మంచి విజ‌యం సాధించింది. మూడో చిత్రంగా వ‌చ్చిన శివ‌మ్ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. నాలుగో సినిమాగా వ‌చ్చిన నేను శైల‌జ స‌క్సెస్ అయ్యింది. ఇక ఐదో సినిమాగా వ‌చ్చిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆరో చిత్రంగా వ‌చ్చే హ‌లో గురు ప్రేమ కోస‌మే ఈ సెంటిమెంట్ ప్ర‌కారం విజ‌యం సాధిస్తుందేమో చూడాలి. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో తెర‌పైకి రానుంది.

More News

మ‌హేశ్ 25వ చిత్రం అప్‌డేట్‌

తాజాగా భ‌ర‌త్ అనే నేను సినిమా రూపంలో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

డ‌ల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు

డ‌ల్లాస్ లో తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ అండ్ ఫిలింస్టార్స్ ఈవెంట్స్ సంయుక్తంగా నిర్వ‌హించిన మూవీ ఆర్టిస్ట్సు సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు బ్ర‌హ్మాండంగా, అంగ‌రంగ వైభంగా జ‌రిగాయి.

కాజ‌ల్‌కు రెండో సారి క‌లిసొస్తుందా?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు గ‌త ఏడాది మంచి విజ‌యాలే ద‌క్కాయి. ముఖ్యంగా.. మెగాస్టార్ చిరంజీవితో తొలిసారిగా క‌లిసి న‌టించిన ఖైదీ నెం.150 ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్

ప్ర‌భాస్‌తో మ‌రోసారి కొర‌టాల శివ‌

మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ అనే నేను.. ఇలా వ‌రుస‌గా నాలుగు విజ‌యాలు సొంతం చేసుకుని సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అయిపోయారు కొరటాల శివ‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ వెర్స‌స్ విజ‌య్ ఆంటోని

ఈ వేసవిలో ఒకే రోజున త‌మ కొత్త చిత్రాల‌తో ఇద్దరు విజయ్‌లు పోటీకి దిగుతున్నారు. వారిలో విజయాల బాటలో ఉన్న హీరో ఒకరైతే.. ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనుకుంటున్న‌ హీరో ఇంకొకరు.