ఆ ఇద్దరితో మొదటిసారి.. కలిసొచ్చేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
'అష్టాచెమ్మా' వంటి హిట్ చిత్రం తరువాత కథానాయకుడు నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్లో 'జెంటిల్ మ్యాన్' పేరుతో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడున్నరేళ్ల గ్యాప్ తరువాత వీరి కలయికలో వస్తున్న చిత్రం ఇది. సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నాని పాత్ర హీరోనా? విలనా? అంటూ ఆసక్తి రేపుతూ ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి స్పందన లభిస్తోంది. జూన్లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటివరకు నానితో గాని, ఇంద్రగంటి మోహనకృష్ణతో గాని మణిశర్మ కలిసి పనిచేసింది లేదు. తొలిసారిగా వారి కాంబినేషన్లో చేస్తున్న మణి.. ఈ సినిమా కోసం మంచి మెలోడీయస్ పాటలను అందించాడని యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో సరైన హిట్ లేని మణిశర్మకి ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకువస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com