'అఆ'తోనూ కొనసాగుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
అర డజను సినిమాల తరువాత స్టార్ హీరో లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం 'అఆ'. 'నువ్వే నువ్వే' తరువాత మళ్లీ యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నితిన్, సమంత జోడీ ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్‌కి సంబంధించిన ఓ సెంటిమెంట్ ఈ సినిమా విషయంలో మరోసారి సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
అదేమిటంటే.. ఏ కథానాయకుడితోనైనా త్రివిక్రమ్ తొలిసారిగా పనిచేసిన చిత్రం విజయం సాధించడం. తరుణ్‌తో తొలిసారిగా పనిచేసిన 'నువ్వే..నువ్వే', మహేష్‌తో మొదటిసారిగా చేసిన 'అతడు'.. పవన్‌తో ఫస్ట్ టైమ్ చేసిన 'జల్సా', అల్లు అర్జున్‌తో తొలిసారిగా చేసిన 'జులాయి' మంచి విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో నితిన్ విషయంలోనూ త్రివిక్రమ్‌కి ఆ సెంటిమెంట్ కొనసాగుతుందేమో చూడాలంటున్నారు విశ్లేషకులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com