నితిన్ కి రిపీట్ అవుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సేషనల్ హిట్ తో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. రెండో సినిమాతోనూ సూపర్ హిట్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు యువ కథానాయకుడు నితిన్. 'జయం', 'దిల్' చిత్రాలతో అలాంటి ఘనతను సొంతం చేసుకున్న నితిన్, 'సై' తరువాత మరో విజయాన్ని చాలా కాలం పాటు చూడలేకపోయాడు. అదిగో సరిగ్గా అలాంటి తరుణంలో అతనికి హిట్ నిచ్చింది 'ఇష్క్' సినిమా. విక్రమ్ కుమార్ అమేజింగ్ డైరెక్షన్, నిత్యామీనన్‌తో నితిన్ ఎక్స్లెంట్ కెమిస్ట్రీ, పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం, అనూప్ - అరవింద్ శంకర్ల సంగీతం.. ఇలా అన్ని అంశాలు సరిగ్గా కుదరడం ఆ సినిమాకి కలిసొచ్చింది.
అంతేకాదు.. అందులో మరో అంశం కూడా ఆ సినిమా విజయంలో కారణంగా నిలిచింది. అదే సిస్టర్ సెంటిమెంట్. సింధు తులాని కాంబినేషన్ లో వచ్చే సీన్స్‌లో నితిన్ నటన సినిమాకి ప్లస్‌గా నిలిచింది. 'ఇష్క్' తరువాత 'గుండె జారి గల్లంతయ్యిందే' మినహాయిస్తే మళ్లీ నితిన్ కి ఇటీవల కాలంలో విజయం లేదు. త్రివిక్రమ్‌తో చేసిన 'అఆ'పైనే నితిన్ తన ఆశలన్నింటినీ పెట్టుకున్నాడు. ఏవో కారణాల వల్ల సినిమా ఏమో విడుదల విషయంలో మొహమాటపడుతోంది.
అయినప్పటికీ నితిన్ ఈ సినిమాపై బాగానే నమ్మకం పెట్టుకున్నాడు. ఇప్పటికే ట్రైలర్స్, పాటలు జనాలకి పట్టేయడం అతని కి సినిమా విజయంపై అంచనాలు పెంచుతున్నాయి. అంతేకాకుండా.. చాన్నాళ్ల తరువాత హిట్ ఇచ్చిన 'ఇష్క్' కి ఎలాగైతే సిస్టర్ సెంటిమెంట్ కలిసొచ్చిందో అదే 'అఆ'లోనూ రిపీట్ అవుతుందని భావిస్తున్నాడట. నితిన్‌కి సిస్టర్‌గా అనన్య నటించిన 'అఆ' అతని సెంటిమెంట్‌ని ఎంత మేరకు నిజం చేస్తుందో త్వరలోనే తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments