మహేష్ కి అయినా కలిసొస్తుందా?

  • IndiaGlitz, [Saturday,May 07 2016]

న‌ట‌న‌కు ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచిన న‌టీమ‌ణుల్లో ఆమె ఒక‌రు. వంక పెట్ట‌లేని విధంగా త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేయ‌గ‌ల నేర్పు ఆమె సొంతం. అలాంటి న‌టిగా పేరు తెచ్చుకున్న ఆమె మ‌రెవ‌రో కాదు రేవ‌తి. బ‌హుభాష‌ల్లో న‌టిగా రాణించిన రేవ‌తి.. తెలుగులోనూ 'ప్రేమ‌', 'గాయం' లాంటి చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది. ఈ మ‌ధ్య కాలంలో త‌ల్లి పాత్ర‌ల‌కు చిరునామాగా మారుతోంది.

'ఈశ్వ‌ర్‌'తో ఈ త‌ర‌హా పాత్ర‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన రేవ‌తి, ఆ త‌రువాత బాగా గ్యాప్ తీసుకుని 'లోఫ‌ర్‌'లోనూ అమ్మ‌గా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆమె న‌ట‌న అద్భుతంగా ఉన్నా.. సినిమాల్లోని లోపాల కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ రిజ‌ల్ట్ రాలేదు. ఈ నేప‌థ్యంలో 'బ్ర‌హ్మోత్స‌వం' లోనూ త‌ల్లి పాత్ర‌లో రేవ‌తి క‌నిపించ‌నున్న వైనం.. ఆ చిత్రానికి సెంటిమెంట్ గా నెగిటివ్ రిజ‌ల్ట్‌నిస్తుందో లేదంటే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి.

More News

సూర్య 24కి కత్తెర పడింది...

స్టార్ హీరో సూర్య హీరోగా,నిర్మాతగా కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో స్టూడియో గ్రీన్,2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24.

జ‌గ‌ప‌తి సినిమా బ్యాన‌ర్ పై రెండు చిత్రాలు...

తెలుగు సినిమా మార్కెట్ రోజురోజుకు పెరుగుతుంది. దీనికి నిద‌ర్శ‌న‌మే బాహుబ‌లి చిత్రం. తెలుగులో రూపొందిన బాహుబ‌లి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. పెరుగుతున్న మార్కెట్ కి త‌గ్గ‌ట్టు ఇండ‌స్ట్రీకి న్యూ టాలెంట్ అవ‌స‌రం ఉంది.

అయినా సరే.. చెర్రీ వదలడం లేదు

ఒకటికి రెండుసార్లు తనకు కలిసి రాకపోయినా సరే అదే పని మూడోసారి చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

'అ..ఆ..'ఆ లిస్ట్ లో చేరుతుందట

లేడీలక్ సమంతకి తెలుగులో సింహభాగం విజయాలున్నాయి.అయితే వాటిలో ఆమెకి నటన పరంగా పేరు తెచ్చిన చిత్రాలంటే 'ఏమాయ చేసావే','మనం'మాత్రమే.

ఇక నుంచి నేను ఏ సినిమా చేసినా అదిరిపోయింది అనే మాట వస్తుంది ఇది గ్యారెంటీ - హీరో సందీప్ కిషన్

స్నేహగీతం,ప్రస్ధానం,వెంకటాద్రి ఎక్స్ ప్రెస్,గుండెల్లో గోదారి,బీరువా,టైగర్,రన్...ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యువ కథానాయకుడు సందీప్ కిషన్.