మహేష్ కి అయినా కలిసొస్తుందా?
- IndiaGlitz, [Saturday,May 07 2016]
నటనకు పర్యాయపదంగా నిలిచిన నటీమణుల్లో ఆమె ఒకరు. వంక పెట్టలేని విధంగా తన అభినయంతో కట్టిపడేయగల నేర్పు ఆమె సొంతం. అలాంటి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె మరెవరో కాదు రేవతి. బహుభాషల్లో నటిగా రాణించిన రేవతి.. తెలుగులోనూ 'ప్రేమ', 'గాయం' లాంటి చిత్రాల్లో హీరోయిన్గా రాణించింది. ఈ మధ్య కాలంలో తల్లి పాత్రలకు చిరునామాగా మారుతోంది.
'ఈశ్వర్'తో ఈ తరహా పాత్రలకు శ్రీకారం చుట్టిన రేవతి, ఆ తరువాత బాగా గ్యాప్ తీసుకుని 'లోఫర్'లోనూ అమ్మగా దర్శనమిచ్చింది. ఆమె నటన అద్భుతంగా ఉన్నా.. సినిమాల్లోని లోపాల కారణంగా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రిజల్ట్ రాలేదు. ఈ నేపథ్యంలో 'బ్రహ్మోత్సవం' లోనూ తల్లి పాత్రలో రేవతి కనిపించనున్న వైనం.. ఆ చిత్రానికి సెంటిమెంట్ గా నెగిటివ్ రిజల్ట్నిస్తుందో లేదంటే సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి.