‘క్షణ క్షణం’తో మెప్పిస్తానంటున్న హీరో ఉదయ్ శంకర్
Send us your feedback to audioarticles@vaarta.com
నిజ జీవితంలో గిన్నిస్ రికార్డ్ సాధించిన ఓ 15 ఏళ్ల బాలుడు.. తన స్కిల్‌ను మెరుగుపరుచుకోవడం కంటే ఎక్కువగా సినిమాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఆ దిశగా అడుగులు వేశాడు. కొన్నేళ్లలోనే తన కలను సాకారం చేసుకున్నాడు. సినిమాలపై మక్కువతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నిజ జీవితంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ యువకుడు హీరోగా మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాడు. అతను ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ శంకర్. ఉదయ్ శంకర్ స్వగ్రామం గద్వాల దగ్గరున్న మల్దకల్. ఆయన స్కూలింగ్ అంతా నిజామాబాద్ జిల్లాలోనే గడిచింది. గుంటూరు వికాస్ కాలేజీలో ఇంటర్ చదివాడు.
తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎంఏ సోషియాలజీ చేశాడు. చిన్నప్పటి నుంచి నటనంటే ఆసక్తి ఉండటంతో బీడీఎస్ రెండేళ్లు చదివి మానేశాడు. ఉదయ్ తండ్రి ఇంగ్లీష్ లెక్చరర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఫిలాసఫీపై రాసిన పుస్తకాలు చదివి వాటి ద్వారానే సినీ రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పాటు చేసుకున్నాడు. అందరు హీరోల్లా మంచి హీరోయిజం ఉన్న చిత్రాన్ని ఎంచుకోకుండా... ‘ఆట గదరా శివ’ వంటి విభిన్నమైన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఉదయ్ శంకర్ పరిచయం అయ్యా. ఆ తర్వాత ‘మిస్ మ్యాచ్’ సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో టాలీవుడ్ ఆడియెన్స్ ని మెప్పించాడు.
ఇప్పుడు వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ‘క్షణక్షణం’ అంటూ ఒక మంచి ఇంట్రస్టింగ్ సినిమా ద్వారా ఫిబ్రవరి 26 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జియా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. మన మూవీస్ బ్యానర్లో డార్క్ కామెడీగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సత్య అనే పాత్రలో ఉదయ్ శంకర్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో కమర్షియల్ నటుడిగా మరో మెట్టు ఎక్కుతాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments