'ఉయ్యాలవాడ..' తో అధిగమిస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
'ఖైదీ నెం.150' తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ చిత్రం సాధించిన ఘనవిజయం మెగాస్టార్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సారి తన తదుపరి చిత్రాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు చిరు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చారిత్రాత్మక చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి.
ఇదిలా ఉంటే.. 'కిక్' నుండి సురేందర్ ట్రాక్ రికార్డు గమనిస్తే ఓ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదేమిటంటే.. ఓ హిట్ తరువాత వెనువెంటనే డిజాస్టర్ పలకరించడం. 'కిక్' వంటి విజయవంతమైన చిత్రం తరువాత సూరి చేసిన 'ఊసరవెల్లి' పరాజయం పాలైంది. ఇక 'రేసుగుర్రం'తో మళ్లీ మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న సదరు దర్శకుడు 'కిక్ 2'తో డిజాస్టర్‌ని రిసీవ్ చేసుకున్నాడు. ఆ తరువాత వచ్చిన 'ధృవ' హిట్ బాటలో పయనించింది. ఈ నేపథ్యంలో రానున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పరిస్థితి ఎలాగుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ కాంబినేషన్‌తో.. సురేందర్ రెడ్డి తనకున్న ఈ ట్రాక్ రికార్డుని అధిగమిస్తాడని ఆశిద్దాం. వచ్చే ఏడాది 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com