'ఉయ్యాలవాడ..' తో అధిగమిస్తాడా?

  • IndiaGlitz, [Friday,August 18 2017]

'ఖైదీ నెం.150' తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ చిత్రం సాధించిన ఘ‌న‌విజ‌యం మెగాస్టార్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సారి త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌రింత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు చిరు. 'ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి' అనే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు లాంఛ‌నంగా జ‌రిగాయి.

ఇదిలా ఉంటే.. 'కిక్' నుండి సురేంద‌ర్ ట్రాక్ రికార్డు గ‌మ‌నిస్తే ఓ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది. అదేమిటంటే.. ఓ హిట్ త‌రువాత వెనువెంట‌నే డిజాస్ట‌ర్ ప‌ల‌క‌రించ‌డం. 'కిక్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత సూరి చేసిన 'ఊస‌ర‌వెల్లి' ప‌రాజ‌యం పాలైంది. ఇక 'రేసుగుర్రం'తో మ‌ళ్లీ మ‌రో స‌క్సెస్‌ని త‌న ఖాతాలో వేసుకున్న స‌ద‌రు ద‌ర్శ‌కుడు 'కిక్ 2'తో డిజాస్ట‌ర్‌ని రిసీవ్ చేసుకున్నాడు. ఆ త‌రువాత వ‌చ్చిన 'ధృవ' హిట్ బాట‌లో ప‌య‌నించింది. ఈ నేప‌థ్యంలో రానున్న 'ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి' ప‌రిస్థితి ఎలాగుంటుందో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. మెగాస్టార్‌ కాంబినేష‌న్‌తో.. సురేంద‌ర్ రెడ్డి త‌న‌కున్న ఈ ట్రాక్ రికార్డుని అధిగ‌మిస్తాడ‌ని ఆశిద్దాం. వ‌చ్చే ఏడాది 'ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

లక్ష్మి మంచు ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నెం.4 ప్రారంభం

ప్రతీ చిత్రంతోనూ వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ,నటిగా,నిర్మాతగా,సమాజ సేవకిగా పేరుపొందిన మంచు లక్ష్మి ప్రధాన పాత్ర లో

బిగ్ బాస్ షోలో సందడి చేసిన తాప్సీ

ఆనందో బ్రహ్మ ప్రమోషన్స్ లో భాగంగా ఢిల్లీబ్యూటీ తాప్సీ పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొన్నారు.

చిరుకే కాదు తనక్కూడా..

గతేడాది ఏ సినిమా చేసినా.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి నిరాశే ఎదురైంది. అయితే ఈ ఏడాది మాత్రం కాజల్కి అనుగుణంగానే ఉంది.. ఇప్పటివరకు.

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా చిత్రం ప్రారంభం

మూడు దశాబ్దాలుగా ఎందరో స్టార్ హీరోల సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేసిన ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా

రామ్ హీరోయిన్స్ తో మెగా హీరో రొమాన్స్

ఓ సినిమాలో యువ కథానాయకుడు రామ్కి జోడీగా నటిస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలు.. వేర్వేరు సినిమాల కోసం మెగా ఫ్యామిలీ కథానాయకుడు సాయిధరమ్ తేజ్తో కలిసి నటించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరంటే.. 'అఆ', 'ప్రేమమ్', 'శతమానం భవతి' చిత్రాలతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న అనుపమ పరమేశ్వరన్.