మళ్లీ ట్రెండ్ సెట్ చేస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
`నేను ట్రెండ్ ఫాలో కాను.. ట్రెండ్ సెట్ చేస్తాను` ఈ డైలాగ్ `గబ్బర్ సింగ్` సినిమాలో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాను కూడా ట్రెండ్ సెట్ చేస్తానని అంటున్నాడు ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా. ఎందుకంటే ఈయన హీరోగా నటించిన చిత్రాల్లో ప్రేమికుడు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో `ముక్కాలా ముకాబులా..` అనే పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
ఇప్పుడు మళ్లీ అదే పాటతో ప్రభుదేవా మాయ చేయబోతున్నారు. ప్రభుదేవా, శ్రద్ధాకపూర్, వరుణ్‌ధావన్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం `స్ట్రీట్ డ్యాన్సర్`. రెమో దర్శకుడు. ఈ సినిమా కోసం `ముక్కాలా ముకాబులా..` పాటను ఓ నిమిషం పాటు ప్రభుదేవా రీ క్రియేట్ చేశారట. ఓ నిమిషం పాటు సాగే ఈ పాటలో వరుణ్‌ధావన్, శ్రద్ధాకపూర్‌లతో పాటు ప్రభుదేవా కూడా తెరపై సందడి చేస్తారట. `స్ట్రీట్ డ్యాన్సర్` చిత్రీకరణ పూర్తయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com