హలో తో హ్యాట్రిక్ దక్కేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎ.ఆర్.రెహమాన్ వంటి గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పనిచేసినా.. దర్శకుడు విక్రమ్ కుమార్‌కి బాగా అచ్చొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం అనూప్ రూబెన్స్‌నే. ఇష్క్ చిత్రంతో వీరి కాంబినేషన్ మొదలైంది. ఈ సినిమాలో మూడు పాటలు, బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన అనూప్ కి.. మనం రూపంలో మరో అవకాశమిచ్చాడు విక్రమ్. ఆ సినిమాకి అనూప్ అందించిన సంగీతం ఓ ఎస్సెట్ అయింది.
దీంతో రెండు వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ఎప్పుడొస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఆ సినిమా కూడా రానుంది. అదే హలో. అక్కినేని నట వారసుడు అఖిల్ రీ-లాంఛ్ చిత్రంగా వస్తున్న ఈ చిత్రం కోసం విక్రమ్, అనూప్ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేస్తున్నారు. హలోతో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొడతారో లేదో తెలియాలంటే డిసెంబర్ 22 వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com