వినాయ‌క్‌తో మ‌రో హిట్ కొడ‌తాడా?

  • IndiaGlitz, [Tuesday,February 26 2019]

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల డైరెక్ట‌ర్‌గా పేరున్న వి.వి.వినాయ‌క్ కొంత‌కాలంగా వెయిటింగ్‌లోనే ఉన్నాడు. చాలా రోజులు నుండి బాల‌కృష్ణ‌తో వినాయ‌క్ సినిమా ఉంటుంద‌ని, సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా ఈ సినిమా రానుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా వినాయ‌క్ త‌న రూట్ మార్చుకున్నాడ‌ట‌. రీసెంట్‌గా ర‌వితేజ‌ను క‌లిసి క‌థ వినిపించాడ‌ట‌. ర‌వితేజ‌కు క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఓకే అన్నాడ‌ని స‌మాచారం. గ‌తంలో వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'కృష్ణ‌' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత హిట్ కాంబోలో సినిమా వ‌స్తుంది. అంటే ర‌వితేజ వినాయ‌క్‌తో మ‌రో హిట్ కొడ‌తాడా? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..